టాలీవుడ్ లో అందరూ హీరోలు ఫ్యాక్షన్ మూవీస్ తీస్తూ ట్రెండ్ సృష్టిస్తున్న సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పటి లాగే తన పంధాలో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అదే సమయంలో పవర్ స్టార్ అభిమానులు తమ హీరో ఎప్పుడు ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా తీస్తాడు అనుకుంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో 'బంగారం'తో ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్. 'బంగారం' పేరు వినగానే మన దేశంలో ఆడవారికి బాగా ఇష్టమైన ఖనిజం అని అందరికి గుర్తుకొస్తుంది. కానీ సినీ ప్రేక్షకులకు మటుకు పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమా గుర్తుకొస్తుంది. తమిళ దర్శకుడు ధరణి డైరెక్షన్ లో శ్రీ సూర్య మూవీస్ నిర్మించిన పవర్ స్టార్ 'బంగారం' 2006లో ఇదే సమ్మర్ లో రిలీజ్ అయింది. ఇప్పటికి ఈ సినిమా టీవీల్లో టెలికాస్ట్ చేస్తే కళ్లప్పగించి చూసే ప్రేక్షకులున్నారంటే అతిశయోక్తి కాదు. 'భగభగ మండే భూమి పొరల్లోంచి బయటకొచ్చిన బంగారాన్ని రా' అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ ఈ సినిమాకే హైలైట్.

 

IHG

 

ఒక మావోయిస్టుని ఇంటర్వ్యూ చేసిన ఒక రిపోర్టర్ తో కథ ప్రారంభించి.. బీబీసీ లోకి వెళ్ళాలి అని కోరుకునే ఒక జర్నలిస్ట్ కథ అని మనకు మొదటి 15 నిమిషాల్లో అర్డమవుతుంది. కానీ హైదరాబాద్ నుంచి బంగారం రాయలసీమకు వెళ్లడం.. అక్కడ సీమ ఆచారాలు చూడడం.. ఫ్యాక్షన్ తో గొడవ పెట్టుకోవడం.. చివరికి హీరో గెలవడం ఇది సినిమా. కానీ పవన్ మార్క్ కామెడీతో పాటు ఫుల్లుగా యాక్షన్ సీన్స్ యాడ్ చేసిన బంగారం పవన్ అభిమానులను బాగా అలరించింది. విద్యా సాగర్ అందించిన బాణీలు ఇప్పటికి అలరిస్తూనే ఉంటాయి. సూపర్‌హిట్‌ ఖుషీ నిర్మాత చిరకాల విరామం తర్వాత పవన్‌తో చేసిన చిత్రం ఇది. దిల్‌, ధూల్‌ వంటి మెగాహిట్స్‌ దర్శకుడు ధరణి 'బంగారం' సినిమాను తనదైన శైలిలో పూర్తి యాక్షన్‌ చిత్రంగా రూపొందించారు. పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటిలాగే తనదైన మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్‌లతో ఎనర్జీగా నటించాడు. కానీ కథలో హీరోహీరోయిన్ల ప్రేమ సన్నివేశాలు లేకపోవడం, తమిళ్ నేటివిటీ ఉండడం, హీరోయిన్‌ వేరే అతణ్ని ప్రేమిస్తే వారిని కలపడానికి హీరో యాక్షన్‌లోకి దిగడమే సినిమా కావడం మితిమీరిన హింస వంటి విషయాలను చాలా మంది ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ సినిమా విడుదలై ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా సోషల్ మీడియా లో సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే ఆనాడు పవన్ యువతకి ఈ సినిమా ద్వారా ఎంత దగ్గరయ్యారో అర్థం చేసుకోవచ్చు. పవన్ స్థాయి సినిమా ఇది కాదు అని కొందరు అభిమానులు అంటున్నా.. ఈ సినిమా వల్ల పవన్ కు అభిమానులు పెరిగారే తప్ప తగ్గలేదు అని చెప్పుకోవచ్చు. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: