టాలీవుడ్ లో యాక్షన్ సినిమాలు అంటే అదీ కూడా ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ సినిమాలు అంటే నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా గుర్తుకు వస్తు ఉంటారు. ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు యాక్షన్ సినిమాలే ఉంటాయి. సినిమా హిట్ ఫ్లాప్ ని పక్కన పెట్టి ఆయన చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన సినిమా సింహా. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది అనేది వాస్తవం. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక డాక్టర్ గా నటించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జీవిత కథకు దగ్గరగా ఉండే ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

 

సినిమా ఇటీవలే పదేళ్ళు పూర్తి చేసుకుంది. బాలకృష్ణ ఈ సినిమాలో తండ్రి గా కొడుకుగా బాగా నటించారు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి అంటూ బాలకృష్ణ నోటి నుంచి వచ్చిన డైలాగులు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాయి అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నుంచి అలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆయన అభిమానులు ఆశించారు. ఆ సినిమాలో ఆయన నరికిన విధానం కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది అనే చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో ఉండే కత్తికి కూడా అభిమానులు ఉన్నారు అనేది వాస్తవం. 

 

ఆ సినిమాను బోయపాటి తెరకెక్కించిన విధానం కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది అనేది వాస్తవం. ఆ సినిమాలో బాలకృష్ణ నోటి నుంచి వచ్చిన డైలాగులు... నేను కొడితే మెడికల్ టెస్ట్ లు చేయించుకోవడానికి ఆస్తులు అమ్మినా సరిపోవు అంటూ ఆయన చెప్పిన డైలాగ్ కి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫాన్స్ ఉన్నారు. దీని మీద టిక్ టాక్ లు కూడా చేసారు. ఇప్పుడు బాలయ్య మళ్ళీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: