బాలకృష్ణ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా... లెజెండ్. ఆయన నటనను పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చిన సినిమా లెజెండ్. బోయాపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలకృష్ణ కు మంచి పేరు తీసుకొచ్చింది. విమర్శకుల ప్రసంశలు కూడా అందుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇప్పటికి సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు. ప్రతీ సీన్ లో కూడా బాలకృష్ణ ప్రాణం పెట్టి నటించారు అనేది వాస్తవం. రాజకీయ నాయకులకు ఎదురొడ్డి నిలుస్తారు ఆయన. 

 

ఆ సినిమాలో జగపతి బాబు చాలా బలంగా ఉంటారు. అయినా సరే ఎక్కడా భయపడకుండా తన కుటుంబ సభ్యులను కోల్పోతున్నా సరే బాలకృష్ణ చేసిన యాక్షన్ చాలా బాగుంటుంది అని విమర్శకులు కూడా అన్న సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. బాలకృష్ణ ప్రతీ సీన్ లో కూడా ప్రేక్షకులను మైమరపించారు అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత వరుసగా ఫ్లాప్ లు వచ్చినా సరే బాలయ్య ఎక్కడా కూడా భయపడలేదు. ఆ సినిమా తర్వాత ఆయనకు చెప్పుకోదగిన హిట్ అనేది ఒక్కటి కూడా లేదు. ఈ సినిమాలో బాలకృష్ణ డైలాగులు ఓటర్ ని అనుకున్నావా బె షూటర్ ని అంటూ ప్రేక్షకులను ఊపెసారు ఆయన. 

 

ఆ సినిమాలో జగపతి బాబు నటన కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది అనేది వాస్తవం. బాలకృష్ణ కు ప్రత్యర్ధి గా ఆయన చేసిన యాక్షన్ విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ సినిమా ఏడాది పాటు ఆడిన థియేటర్ కూడా కడప జిల్లాలో ఉంది అనేది వాస్తవం. ఈ సినిమా తో బాలయ్య రేంజ్ మరో స్థాయికి వెళ్ళింది అనేది వాస్తవం. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: