జబర్దస్త్ కార్యక్రమం లో హాస్యనటుడిగా అడుగుపెట్టి తెలుగు రాష్ట్రాలలో ఎనలేని పాపులారిటీ సంపాదించిన హైపర్ ఆది ప్రస్తుతం ప్రముఖ హీరోల సినిమాలలో సైడ్ హీరో పాత్రల్లో నటించే స్థాయికి ఎదిగాడు. వ్యాఖ్యాత గా కూడా ఎన్నో కార్యక్రమాలలో దూసుకుపోతూ రెండు చేతులా లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు ఆది. ఈయనకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. జబర్దస్త్ స్కిట్స్ లలో కూడా ఆయనకు పవన్ కళ్యాణ్, చిరు పై ఉన్న అభిమానాన్ని చాలా సార్లు తెలియజేసాడు. నాగబాబు జబర్దస్త్ వదిలి వెళ్లిపోయిన తర్వాత కూడా తను చేసిన వ్యాఖ్యలు అతనికి మెగాఫ్యామిలీపై ఉన్న ప్రేమని తెలియపరిచాయి.


అయితే ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆది పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇష్టమైన హీరో ఎవరు అని ప్రశ్నించినప్పుడు... చిరంజీవి పవన్ కళ్యాణ్ చెబుతూ తనకు ఇష్టమైన సినిమా కూడా చిరంజీవి హీరో గా నటించిన విజేత అని తెలిపాడు. జబర్దస్త్ లోకి కిర్రాక్ ఆర్పీ మంచి ఫ్రెండ్స్ అని ఈ సందర్భంగా తెలియజేశాడు. తనకు నచ్చిన రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పాడు.


ఒకవేళ దేవుడు వరం కోరుకొమ్మని అడిగితే మీరేం కోరుకుంటారు అని ఇంటర్వ్యూ చేసే మహిళ ప్రశ్నించగా... పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాను. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి గా నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ లాంటివాళ్ళు
రాజకీయాలకు చాలా తక్కువ మంది వస్తుంటారు. జయప్రకాశ్ నారాయణ్, పవన్ లాంటి వ్యక్తులు సమాజానికి సేవ చేసేందుకే రాజకీయాల్లో అడుగు పెడతారు కానీ మరే ఇతర దురుద్దేశాలను మనసులో పెట్టుకోరు. డబ్బు కొట్టేద్దామని వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ప్రయత్నించరు. అందుకే వాళ్లపై డబ్బు చేసుకున్నట్టు ఎటువంటి పుకార్లు రావని ఆది తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: