బోయపాటి శ్రీను అంటే యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. అలాంటి దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా తీస్తే ఒక రేంజిలో అంచనాలు పెరిగిపోతాయి. పవర్ ఫుల్ డైలాగులు అదిరిపోయే యాక్షన్ సీన్లు అబ్బో ఇలా ఊహించుకుంటే ప్రేక్షకులందరికీ ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా కోసం ఏకంగా రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ చేయడం..బాడీని బాగా పెంచడం కూడా ఈ సినిమాపై బాగా అంచనాలను పెంచుతుంది. ఇక ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో యాక్షన్ ఏ రేంజిలో ఉంది అంటే ఏకంగా అభిమానులకు సైతం ఊచ కోత చూస్తే వికారం వేసేలా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి.
ఈ సినిమాలు బోయపాటి రామ్ చరణ్ తో కాస్త అతి చేయించారు అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. బాడీ పెంచి అంతలా సిక్స్ ప్యాక్ చేసి కష్టపడితే బోయపాటి మొత్తం చెడగొట్టాడు అని అప్పుడప్పుడూ నిరాశ చెందుతుంటారు మెగా అభిమానులు. సినిమాలు యాక్షన్ విషయానికి వస్తే దానికి మాత్రం ఎక్కడా కొదవలేదు. సినిమా మొదటి నుంచి సినిమా చివరి వరకూ.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అది కూడా మామూలుగా కాదండోయ్ విలన్లను హీరో ఊచ కొత్త కోస్తూ ఉంటాడు మొత్తం.
అంతేకాకుండా కొన్ని అసాధ్యం కానీ సన్నివేశాలను కూడా సుసాధ్యం చేస్తూ బోయపాటి శీను వినయ విధేయ రామ సినిమాలో ఇరికించాడు. ఈ సన్నివేశాలు సినిమాకు మరింత మైనస్ గా మారిపోయాయి. ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో రామ్ చరణ్ అదరగొట్టారు అనే చెప్పాలి. తన సిక్స్ ప్యాక్ బాడీతో అందరిని ఆశ్చర్య పరచడమే కాదు.. అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ తో దుమ్మురేపాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. బహుశా వినయ విధేయ రామ సినిమాలో చేసినంతగా యాక్షన్ రామ్ చరణ్ ఇప్పటివరకు ఏ సినిమాలో చేసి ఉండకపోవచ్చు.