టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలకు, ఇతర నటులకు తన గాత్రాన్ని అందించిన డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు సాయి కుమార్ తనయుడు ఆది 2011 లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ కావాలి’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. క్రికెట్ అంటే ఎంతో అభిమానిస్తాడు ఈ యువ హీరో.   ‘ప్రేమ కావాలి’  విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందడంతో ఆది  మంచి పేరు సంపాదించాడు. 2011 లో దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నాడు.  తరువాత బి. జయ దర్శకత్వంలో వచ్చిన లవ్‌లీ (2012) అనే సినిమాలో నటించాడు.

 

ఈ సినిమాలో కూడా ఆది నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.  ఆ తర్వాత ఆది నటించి సినిమాలన్నీ వరుస ఫెయిల్యూర్స్ కావడం మొదలయ్యాయి.  దాంతో కొంత కాలం సినిమాకు దూరంగా ఉన్న ఆది ఆ మద్య ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ తో ప్రేక్షకుల ముందు వచ్చాడు.  ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా పెద్దగా సక్సెస్ మాత్రం కాలేదు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు వున్నాయి. సోషియో ఫాంటసీతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా 'జంగిల్' రూపొందుతుంటే, ప్రేమకథా చిత్రంగా 'శశి' నిర్మితమవుతోందని చెప్పారు. నా కెరియర్ తొలినాళ్లలో కథల ఎంపిక విషయంలో నాన్నగారి సూచనలు ఉండేవి.

 

ఆ తరువాత నా కథలకు సంబంధించిన నిర్ణయాలను నేనే తీసుకోవాలని అనుకున్నాను. అలా చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను అందించలేదు.  ఇక సినీ పరిశ్రమలో నాన్నగారి గాత్రం అంటే ఎంతో మంది అభిమానిస్తుంటారు.  ఆయన గాత్రాన్ని ఎంతో మంది మిమిక్రీ ఆర్టిస్టులు అనుకరిస్తుంటారు.  నాన్నగారికి 'పోలీస్ స్టోరీ' హిట్ పడినట్టు నాకు ఒక మంచి హిట్ పడేవరకూ ఎదురుచూడవలసిందే. అంతకు ముందు నాన్నగార ఎన్నో సినిమాల్లో నటించిన ఒక్కటి పేరు తీసుకు రాలేదని అన్నారు. ఇక పూరి,శేఖర్ కమ్ముల,మోహనకృష్ణ ఇంద్రగంటి, సందీప్ రెడ్డి వంటి దర్శకులతో పనిచేయాలనుంది" అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: