మాస్ పల్స్ తెలిసిన అస‌లు సిసలైన దర్శకుడు వి.వి. వినాయ‌క్‌. యాక్ష‌న్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్ అని చెప్ప‌వ‌చ్చు.  ఆయన సినిమాలు చూస్తే కొన్న టికెట్ కు సరిపడా వినోదం గ్యారెంటీ. పంచ్ లలో కసి, డైలాగులలో పదును రంగరించి ఆడియన్స్ ను కేక పుట్టిస్తున్న డైరెక్టర్. తెరపై హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేయాలో తెలిసిన సినీ మాంత్రికుడాయ‌న‌. కామెడీ, యాక్షన్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే డైరెక్టర్ వివినాయక్. 

 

జూనియర్ ఎన్టీఆర్‌తో మొట్ట మొద‌టి సారి తెరకెక్కించిన ‘ఆది’తో ఆరంభించి.. బాలయ్యతో తీసిని ‘చెన్నకేశవరెడ్డి’తో చెలరేగిపోయాడు. మరోవైపు నితిన్ వంటి చిన్న హీరోతో ‘దిల్’ వంటి యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌‌ను తెరకెక్కించి తనేంటో నిరూపించుకున్నాడు. చిరంజీవిని ‘ఠాగూర్’గా చూపించినా.. బన్నీని మాస్ యాంగిల్‌లో చూపించినా.. రవితేజను ‘కృష్ణ’గా చూపించినా అది వినాయ‌క్‌కే సాధ్య‌మ‌యింది. మాస్ పల్స్ పట్టుకున్న డైనామిక్ డైరెక్టర్ వినాయక్. స్టైలీష్ టేకింగ్ తో ప్రతి ఫ్రేముని ఎంతో కలర్ ఫుల్ గా తెర‌కెక్కించ‌గ‌ల స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బద్రినాథ్’, ‘అఖిల్’  మూవీలు కూడా వినాయక్‌ను విమర్శల పాలు చేసింది. అవి కూడా మంచి యాక్ష‌న్ మూవీస్‌గా తెర‌కెక్కాయి కాని ఆశించినంత హిట్ రాలేదు.

 

తెలుగు వెండితెర మీద వినాయక్ సినిమాలు ఓ బ్లాస్ట్. ఆయన హీరోలు మిస్సైల్స్. ఆయన ఎంచుకునే పాయింటే ఆయుధం. టోటల్ గా ఆయన సినిమాలు సెల్యులైడ్ సెలబ్రేషన్స్. మాస్ ప్రేక్షకుల్ని సంబరపరిచేలా సినిమాలు ఎలా ఉండాలో తెల్సిన దర్శకుడు వినాయక్. మరి ఈ మూవీతోనైన సత్తా చాటి దర్శకుడిగా పూర్వ వైభవం అందుకోవాలని చూస్తున్నాడు. ఏమైనా తెలుగు సినీమా ప్రస్థానంలో దర్శకుడిగా వినాయక్‌ది ప్రత్యేక శైలి అని చెప్పొచ్చు. అలాగే సుమోలు లేపాలంటే అంటే అది వినాయ‌క్ వ‌ల్లే అవుతుంది. అలాగే మాస్ డైలాగుల‌తోనే స‌గం సినిమాని హిట్ చేసేస్తాడు వినాయ‌క్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: