తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు తండ్రీకొడుకులు అయినప్పటికీ ఎప్పుడు స్నేహితుల్లా  సరదాగా ఉంటారు. అది ఇంట్లో అయినా లేదా బయట ఎక్కడైనా ఈవెంట్లో ఆయన తండ్రి కొడుకల్లా  కాకుండా స్నేహితుల్లా ఎప్పుడూ సరదాగా కనిపిస్తూ ఉంటారు రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి లు. ఇకపోతే ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా సినిమా షూటింగ్ లు  ఆగిపోవడంతో... సినీ సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. 

 


 ఇక ఇంట్లో ఉండి ఖాళీగా ఉండడం ఎందుకు అని ఏదో ఒక కొత్త పని నేర్చుకుంటున్నారు సినీ సెలబ్రిటీలు. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న బీ ద రియల్ మాన్ ఛాలెంజ్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయడంతో పాటు తమ పని తాము చేసుకుంటున్నామని అంటూ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా సినీ సెలబ్రిటీల అందరూ ఏదో ఒక కొత్తగా ట్రై చేసి  నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో నాన్నమ్మ  తో కలిసి వెన్న తయారుచేయడం ఎలా అనేదాన్ని నేర్చుకుంటున్నారు. నాన్నమ్మ చేతపట్టి నేర్పిస్తూ ఉంటే రామ్ చరణ్ ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని నేర్చుకుంటున్నారు. 

 

 దీనికి కి సంబంధించిన వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా... తాజాగా దీనిపై రామ్ చరణ్ నాన్న గారైన మెగాస్టార్ చిరంజీవి ఓ కామెంట్ పెట్టారు. మై డియర్ బచ్చా... మా అమ్మ దగ్గర ని  బట్టర్ ఉడకదురా ... మా అమ్మ దగ్గర ఫస్ట్ ప్లేస్ ఎప్పుడూ నాదే... ఎంత వెన్న తయారుచేసిన...నీ  పొజిషన్  మాత్రం ఎప్పుడూ మా అమ్మ దగ్గర నా తర్వాతే అంటూ ఓ పోస్టు పెట్టాడు. అదే మీ అమ్మ దగ్గర  అనుకో  ఆ గ్యారెంటీ నాకు లేదు అంటూ చమత్కరించాడు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా దీనికి సంబంధించిన ట్విట్  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: