బాలక్రిష్ణ టాలీవుడ్ సీనియర్ హీరో. ఆయన వందకు పైగా మూవీస్ చేసి ఈ జనరేషన్లో రికార్డ్ క్రియేట్ చేశారు. బాలయ్య ఇన్ని సినిమాలు చేసినా కూడా ఇంకా నాటౌట్ అంటూ యంగ్ హెరోలతో పోటీ పడడం ఒక విశేషమైతే ఇప్పటికీ డ్యాన్సులతో, యాక్షన్ సీన్లతో సత్తా చాటడం మరో విశేషం.

 

ఇదిలా ఉండగా బాలయ్య కొత్త మూవీ పక్కా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఉన్న సంగతి విధితమే. బోయపాటి బాలయ్య హ్యాట్రిక్ కాంబో కావడంతో ఈ మూవీపైన అంచనాలు నింగిని తాకుతున్నాయి. పైగా ఈ మూవీలో బాలయ్య అఘోరాగా నటించడం మరో హైలెట్. బాలయ్య లాంటి పెద్ద నటుడు అఘోరా పాత్రకు ఒకే చేప్పడమే అతి  పెద్ద స్పెషల్.

 

ఇక ఈ మూవీకి సంబంధించి ఇంటెరెస్టింగ్ అప్ డేట్ ఒకటి ఉంది. అదేంటి అంటే బాలయ్య సినిమాలో హీరోయిన్ల కొరత తీరింది. నిజంగా ఇది బాలయ్యకు బిగ్ రిలీఫ్. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందులో ఒకామే బోంబే మోడల్ అని తెలుస్తోంది. ఇక  ఈ ఇద్దరు హీరోయిన్లూ కూడా ఫిల్మ్ ఇండస్త్రీకి కొత్త.

 

బాలయ్య మూవీ ద్వారానే వారు పరిచయం అవుతున్నారు. ఓ విధంగా ఇది కూడా బాలయ్య ట్రెండ్ క్రియేట్ చేస్తున్నట్లే లెక్క. అప్పట్లో వెంకటేష్ ఇండస్ట్రీకి హీరోయిన్లను పరిచయం చేసేవాడు. అయితే వారు నార్త్ లో నటించిన వచ్చిన హీరోయిన్లు. బాలయ్య మాత్రం సినిమాకు రంగు పూసుకోని హీరోయిన్లను తెరపైన పరిచయం చేస్తున్నాడు, ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే వారికి కూడా పేరు రావడమే కాదు, టాలీవుడ్ కి కొత్త అందాలు వస్తాయన్న మాట. 

 

 ఇక ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లూ కేవలం గ్లామర్ డాల్స్ కాదుట. వారి పాత్రలకు కూడా చాలా ఇంపార్టన్స్  ఉంటుందిట. ఇక ఈ మూవీలో  తరువాత షెడ్యూల్  లాక్ డౌన్ ఎత్తేశాక  ప్రారంభిస్తారుట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: