అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ముకుందా  సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొదట్లో ఈ అమ్మడు చేసిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ . టాలీవుడ్ లో అందరు దర్శకులు నిర్మాతలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పూజా హెగ్డే. తన అందం అభినయంతో ప్రేక్షకుల మతి పోగొడుతూ నే తన అదిరె  అందాలతో ఎంతో మంది అభిమానులకు చెమటలు పట్టిస్తుంది పూజా హెగ్డే. పూజా హెగ్డే క్యూట్ క్యూట్ నవ్వుకి ఫిదా అవ్వని  ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి లేదు. 

 


 అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే  వ్యాయామం  చేస్తూ ఇంట్లోనే సమయం గడుపుతు  ఉన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అంతే కాదు హాట్ హాట్ ఫోటో షూట్ లు  చేసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. అభిమానులు తెగ ఆకర్షిస్తూ ఉంటుంది పూజ హిగ్డే . అందాల ఆరబోతలో ఈ అమ్మడు ఎక్కడ లిమిట్స్ పెట్టుకోదు  అని చెప్పాలి. ఇక ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు... సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో పెట్టింది. 

 


 ట్విట్టర్లో ఈ అమ్మడు సంబంధించిన ఫోటో ప్రస్తుతం  చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలు పింక్  డ్రెస్ లో మెరిసిపోతున్న ఈ అమ్మడు బార్బీ డాల్ లాగా కనిపిస్తోంది.  పైన క్యాప్షన్ గా అందరినీ మంత్రముగ్ధులను చేసే అందం తో  మెరిసిపోతున్న పూజా హెగ్డే బార్బీ ప్రిన్సెస్ కంటే  100 రేట్లు ఎక్కువగా అందంగా  ఉంది అంటూ ఈ ఫోటో పై ఓ క్యాప్షన్ కూడా ఉంది. ఈ ఫోటోలో ఎంతో  క్యూట్ గా ఉన్న పూజా హెగ్డే చిరునవ్వు చిందిస్తూ బుల్లి గౌన్  వేసుకొని నిజంగా బార్బీ డాల్ లాగా కనిపిస్తోంది. ఇక ఇది చూసిన ప్రేక్షకులు అందరూ ఫిదా అవుతున్నారు అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: