తెర మీద అందంగా కనిపించే హీరోయిన్లను చూస్తే ప్రతీ వారూ ఫ్యాన్ అయిపోతారు. వారిని తమ హ్రుదయాధిదేవతలుగా భావిస్తారు. వారిని కళ్ళకు కట్టుకుని కొలుస్తూంటారు. డ్రీం గర్ల్స్ వాళ్ళే. కలలో రాకుమార్తెలు వారే. అంతటి అందగత్తెల మనసు కూడా ఇంకా అందంగా ఉంటుంది.

 

అయితే అది అందంగానే కాదు, మెత్తగా కూడా ఉంటుంది. అందుకే ఠక్కున పడిపోతుంది. చటుక్కున చిక్కిపోతుంది. సినిమాల్లో పొగరుమోతు అమ్మాయిలుగా, గడసరి సొగసుగత్తెలుగా కనిపించే హీరోయిన్లు నిజ జీవితంలో ఎందుకో బేలగా కనిపిస్తారు. ఊరకనే నమ్మేసి ప్రేమల్లో ఇట్టే పడిపోతారు. దానికి ఎంతో మంది హీరోయిన్లు ఉదాహరణ. అలనాటి ఫటాఫట్  జయలక్ష్మి నుంచి సిల్క్ స్మిత నుంచి ఇప్పటి తారల వరకూ. ఇంకా చెప్పాలంటే మహానటి సావత్రిని కూడా లెక్కలో వేసుకోవాలి.

 

వీరంతా అందమైన మనసుతో ప్రేమించారు. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగిలిన వారు ప్రేమకు బలి అయిపోయారు. ఇక తాజాగా నయకతార ప్రేమ కూడా తరచూ  బ్రెకప్ అవుతూ  పడుతూ లేస్తూ ఉంది. ఆమె ప్రేమ సక్సెస్ అయితే తామూ హ్యాపీగా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. ఇక ఇపుడు మరో భామ కూడా తనది ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అంటోంది.

 

ఆమె ఎవరో కాదు రత్తాలూ రత్తాలూ అని పాడిన మెగాస్టార్ చొక్కా బొత్తాలు కదిలించేసిన హాట్ భామ. తనబు కూడా ప్రేమ మోసమే చేసిందని ఆమె తాజాగా చెప్పుకొచ్చింది. ఇక ఆమె ఇప్ప్పటికి మూడు సార్లు మోసపోయిందట. అందుకే ప్రేమపై పెద్దగా నమ్మకం లేదని బోల్డ్ గా చెప్పేస్తోంది.

 

ఆమె మోసపోయింది నిజమే అయినా మోసం చేసిన వారి పేర్లను మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఆమెకు ఒక క్రికెటర్ తో పాటు, మరి కొందరితో ప్రేమ ఉన్నట్లు అప్పట్లో పుకార్లు వినిపించాయి. ఏది ఏమైనా తెర మీద హీరోయిన్లుగా రెచ్చిపోయిన ఈ భామలు నిజ జీవితంలో ఎందుకు ఇంతలా వీక్ గా కనిపిస్తున్నారన్నది అర్ధం కాని విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: