టాలీవుడ్ లో అనుష్క ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. కాని ఇప్పుడు ఆమె ఏ సినిమా చెయ్యాలో అర్ధం కాని పరిస్థితిలో ఉంది. తానే దర్శకురాలి గా మారి ఒక సినిమాను చెయ్యాలి అని కూడా అనుష్క చాలా ప్రయత్నాలు చేస్తుంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ సినిమా గురించి ఆమె ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒక యువ రచయిత ఇచ్చిన కథ ఆమెకు చాలా బాగా నచ్చింది అని ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళాలి అని ఆమె పట్టదలగా ఉందనే ప్రచారం జరుగుతుంది. 

 

అనుష్క నటించిన ఒక సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఆమె కన్నడం లో ఒక సినిమా తమిళంలో ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమా తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఆమె ఉందనే ప్రచారం టాలీవుడ్ లో జరుగుతుంది అనుష్క ఈ సినిమాను ప్రభాస్ సహకారం తో తీసుకొచ్చే ఆలోచనలో ఉందని టాలీవుడ్ జనం అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె చర్చలను కూడా పూర్తి చేసింది అని సమాచారం. ఆమెకు కథ బాగా నచ్చింది తనకు దర్శకత్వం చేయడం ఒక కోరిక అని అందుకే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్తాను అని చెప్పినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. 

 

ప్రస్తుతం లాక్ డౌన్ లో కథకు పూర్తిగా మెరుగులు దిద్దిన తర్వాత సెట్స్ మీదకు తీసుకుని వెళ్తే బాగుంటుంది అని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే రాఘవేంద్ర రావు ని కూడా కథలో మార్పులు అడగాగా ఆయన కొన్ని సూచనలు చేసారని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచన చేస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: