ఇండియన్ సినిమాలో ఇప్పుడు ఎక్కువగా బయోపిక్ ల హవా కొనసాగుతుంది. సినీ రాజకీయ ప్రముఖుల జీవితాల ఆధారంగా ఈ సినిమాలను తీసే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా ఈ సినిమాల మీద దర్శక నిర్మాతలు దృష్టి పెడుతున్నారు. ఈ నేపధ్యంలోనే నందమూరి కుటుంబానికి సంబంధించిన బయోపిక్ ఒకటి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా ఆ కుటుంబం లో జరిగాయి అని అంటున్నారు. ఆ బయోపిక్ ఎవరిదో కాదు... 

 

జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమాలో తన తండ్రి పాత్రను నేరుగా జూనియర్ ఎన్టీఆర్ పోషించే అవకాశం ఉందని కూడా సమాచారం. టాలీవుడ్ లో ఈ సినిమా గురించి ఇప్పటికే కొంత ప్రచారం కూడా జరుగుతుంది. ఇది నిజమే అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమాను తీసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 

 

ఈ సినిమాను బాలకృష్ణ నిర్మించే అవకాశం ఉందని హరికృష్ణ జీవిత కథలో రాజకీయం ఎక్కువగా ఉంటుందని ఆ రాజకీయాన్ని ఈ సినిమాలో ఎక్కువగా చూపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కథను పరుచూరి బ్రదర్స్ రెడీ చేస్తున్నారని రాఘవేంద్ర రావు సహకారం తీసుకుని ఈ సినిమా కథను వాళ్ళు రెడీ చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ సినిమా ఎంత వరకు సెట్స్ మీదకు వచ్చే అవకాశం ఉంది అనేది స్పష్టత రావడం లేదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి లో విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: