తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ ఎవరని అడిగితే వెంటనే సుమా కనకాల అంటారు.  సుమా కనకాలది కేరళా అయినా ఆమె చిన్నతనంలో హైదరాబాద్ కావడం  ఇక్కడి భాషపై మంచి పట్టు సంపాదించింది. బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టిన కెరీర్ లో రాజీవ్ కనకాల ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  తెలుగు లో సమ యాంకరింగ్ అంటే సినీ సెలబ్రెటీలు ఎంతో ఇష్టపడుతుంటారు. అందుకే స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. ఓ వైపు బుల్లితెర.. మరోవైపు స్టేపై యాంకరింగ్ చేస్తూ ఎప్పుడు బిజీగా ఉండే సుమ ఇప్పుడు ఇంటిపట్టున ఉంటుంది.  మార్చి నెల నుంచి తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసందే.. దాంతో షూటింగ్స్, రిలీజ్ లు అన్నీ ఆగిపోయాయి. 

 

 బుల్లితెరపై షూటింగ్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు.  దాంతో ఇప్పుడు సుమ ఇంటి వద్ద ఉంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంది.  ఆ మ‌ధ్య యాంక‌ర్స్‌తో క‌లిసి ఫ‌న్నీ వీడియో చేసిన సుమ తాజాగా త‌న ప‌నిమనిషితో క‌లిసి కొంత కామెడీ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది.  మేడే సంద‌ర్భంగా ఈ క‌ష్ట కాలంలోను ప‌ని చేస్తున్న కార్మికుల అంద‌రికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది.  ఈ సందర్భంగా మన కుటుంబంలో ఆడవారు ఒక్క రూపాయి తీసుకోకుండా రోజంతా కష్టపడతారని.. అమ్మలకు.. అక్కలకు.. భార్యలకు, పిన్నులు అందరికీ కూడా మేడే విషెస్ చెప్పింది సుమ. 

 

ఇక త‌న ఇంట్లో ప‌ని చేస్తున్న మ‌హి అనే ప‌ని మ‌నిషిని ప‌రిచ‌యం చేస్తూ.. ఆమె ఉంది కాబట్టే తను షూటింగ్స్ ఉన్నపుడు ఏ టెన్షన్ లేకుండా ఉన్నానని చెప్పింది. చివరిగా తన పనిమనిషిపై ఓ పంచ్ వేసింది.. ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో ఇద్దరం కలిసి పని చేస్తున్నాం. మ‌రి నీ జీతంలో సగం నాకిస్తావా అంటూ మ‌హితో కామెడీ కూడా చేసింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: