తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ సినిమా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదల చేస్తున్నారు అన్న వార్తలను మాస్టర్ నిర్మాతల మండలిలో ఒకరు ఖండించారు. మాస్టర్ నిర్మాతలలో ఒకరైన లలిత్ కుమార్, విజయ్ నటించిన  ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో నైనా నేరుగా విడుదల చేసే ఆలోచన చిత్ర యూనిట్ కి లేదని స్పష్టం చేశాడు. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమాను థియేటర్లలో నేరుగా విడుదల చేస్తున్నట్లు ఆయన ధృవీకరించాడు. మాస్టర్ సినిమా ను అమెజాన్ ప్రైమ్ లో విడుదల గురించి వస్తున్నా పుకార్లను ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఖండించారు.

IHG's Martial Arts Training for Master! <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TAMIL' target='_blank' title='tamil-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tamil</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> ...

 

ఆ పుకార్ ఏమిటంటే అమెజాన్ ప్రైమ్ వారు ఆ సినిమా విడుదలకు గాను మాస్టర్ చిత్ర యూనిట్ దారులకు రూ. 125 కోట్ల ఒప్పందం  కుదిరింది అని. అయితే ఈ పుకార్లను ఆయన కొట్టిపారేశారు. హీరో విజయ్ చివరిసారిగా అట్లీ దర్శకత్వంలో బిగిల్ లో ద్వి పాత్రను పోషించాడు. ఆ సినిమాలో కొడుకు మరియు తండ్రిగా రెండు పాత్రలను చేసి ప్రేక్షకులను మెప్పించాడు. జాకీష్రాఫ్, నయనతార ఈ సినిమాలో నటించారు. బిగిల్  బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇది తమిళ్ ఇండస్ట్రీలో 2019లో సాధించిన అత్యధిక  వసూలు చేసిన సినిమాగా అవతరించింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో విజయ్ నటించారు. విజయ్ సేతుపతి  విలన్ పాత్రను చేస్తున్నాడు. మాళవిక మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆండ్రియా జెర్మియా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

IHG's 'Master' tracklist details leaked ...

మరింత సమాచారం తెలుసుకోండి: