విజయ్ దేవరకొండ విషయంలో రాంగ్ స్టెప్ చేశానని రాశీఖన్నా ఒప్పుకుందా.. ఇంతకీ ఏ విషయంలో రాశీఖన్నా తన తల్లిదండ్రులను బాధపెట్టింది. అసలు రాశీఖన్నా మాట్లాడింది ఏంటి.. వెబ్ సైట్లు రాసింది ఏంటి.. ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది రాశి. 

 

ముద్దుగుమ్మగా మారిన బొద్దుగుమ్మ కెరీర్ మొదట్లో గ్లామర్ కు దూరంగా ఉండేది. రానురాను.. గ్రామర్ షోకు ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తోంది. ఈ మధ్యకాలంలో ఖాళీ దొరికితే చాలు.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చగొడుతోంది రాశి. 

 

రాశిఖన్నా విజయ్ దేవరకొండతో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చేదు అనుభవం మిగిల్చింది. ఇందులో పోషించిన యామిని రోల్ తనకు ఎంతో పేరు తెస్తుందని ఆశపడింది. టీజర్.. ట్రైలర్ లో బోల్డ్ గా కనిపించదన్న కామెంట్స్ వచ్చినా.. క్యారెక్టర్ డిమాండ్ చేసిందని.. ఎమోషన్ చూడాలి తప్ప.. బోల్డ్ నెస్ చూడకూడదని కవరింగ్ ఇచ్చింది రాశి. తీరా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యేసరికి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇక నుంచి హద్దులు దాటనని.. పేరెంట్స్ హర్ట్ అయ్యే రోల్స్ చేయనని.. రాశీ అన్నట్టు కొన్ని వెబ్ సైట్లు రాయగా.. ట్విట్టర్ వేదికగా ఈ వార్తలను రాశీ వ్యతిరేకించింది.

 

వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో తాను అలా మాట్లాడలేదని రాశీఖన్నా స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించింది. తను నటించిన ప్రతీ సినిమాను స్వీకరిస్తాననీ.. బాధపడుతూ ఏ సినిమాలోనూ నటించలేదని చెప్పింది. సినిమా హిట్టయినా.. ఫ్లాపయినా.. ప్రతీ సినిమా ఒక అందమైన ప్రయాణం. ప్రతి చిత్రం కొత్త విషయాల్ని నేర్పుతుందని పేర్కొంది రాశీ ఖన్నా. రాశీఖన్నా తొలుత గ్లామర్ షోకు దూరంగా ఉన్నా.. పరిస్థితులు ఆమెను ఆ దిశగా నడిపించాయి. అది ఆ ముద్దుగుమ్మకు నచ్చిందో ఏమో గానీ హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారును రెచ్చగొడుతోంది రాశీఖన్నా. 




మరింత సమాచారం తెలుసుకోండి: