బాలకృష్ణ హీరోయిన్స్ కోసం పెద్దగా ట్రై చేయడు. ఇప్పటి స్టార్స్.. పూజా హెగ్డే.. రష్మిక నటించకపోయినా పట్టించుకోడు. నిన్నటి స్టార్స్ శ్రియ, నయనతార డేట్స్ ఎడ్జెస్ట్ చేయకపోయినా లైట్ గా తీసుకుంటాడు. ఎందుకంటే.. హీరోయిన్స్ విషయంలో బాలయ్యకు మరో ఆప్షన్ ఉంది. బాలయ్యకు హీరోయిన్ని తెచ్చిపెట్టిన ఆ ఆప్షన్ ఏంటో తెలుసా.. 

 

బాలకృష్ణ పక్కన హీరోయిన్ ను సెలక్ట్ చేయడం దర్శకులకు ఒకరకంగా కత్తిమీద సాములాంటిదే. సీనియర్ హీరోలతో నటించేందుకు స్టార్స్ వెనుకాడతారు. శ్రియ.. నయనతారతో ఇప్పటికే మూడు, నాలుగు సార్లు నటించాడు. ప్రతి సినిమాలోనూ వీళ్లే అంటే.. చూడటానికి బోర్ కొడుతుంది. సీనియర్స్ నటిస్తే.. ఏజ్డ్ హీరోయిన్స్ ముద్ర పడుతుందన్న భయంతో ఈ జనరేషన్ హీరోయిన్స్ దూరంగా ఉంటారు. ఈ లెక్కలన్నింటికీ బాలయ్య దగ్గర ఓ చిట్కా ఉంది. ఎవరూ దొరకకపోతే.. బాలీవుడ్ హీరోయిన్ తో నటించేస్తాడు బాలయ్య. 

 

రూలర్ తర్వాత బాలయ్య బోయపాటి సినిమా చేస్తున్నాడు. ఓ భారీ ఫైట్.. రెండు సీన్స్ తో మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. బాలీవుడ్ హీరోయిన్ని అనుకుంటున్నామని.. రెండో షెడ్యూల్ మొదలయ్యే సమయానికి హీరోయిన్ని ఎనౌన్స్ చేస్తామన్నాడు దర్శకుడు. 

 

బాలకృష్ణ బాలీవుడ్ హీరోయిన్స్ జత కట్టడం కొత్తేమీ కాదు. కథానాయకుడు మూవీలో విద్యాబాలన్ తో జతకట్టాడు. ఎన్టీఆర్ బయోపిక్ గా రూపొందిన కథానాయకుడు.. మహానాయకుడితో విద్యాబాలన్ ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర పోషించింది. హీరోయిన్స్ ఎంపిక కష్టంగా ఉంటే బాలీవుడ్ నుంచి తీసుకురావడం బాలకృష్ణ దర్శకులకు అలవాటే. ఒక్కోసారి ఫ్రెష్ ఫేస్ కోసం బాలీవుడ్ భామను దిగుమతి చేసుకుంటారు. పరమ వీరచక్రలో అమీషా పటేల్ తో..రూలర్ డిక్టేటర్.. లెజెండ్ లో మూడుసార్లు సోనాలి చౌహాన్ తో.. పైసా వసూల్ లో ముస్కన్ సేథీతో జతకట్టాడు బాలయ్య. మొత్తానికి బాలయ్యకు హీరోయిన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: