టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబంలోని హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వారందరూ చిరంజీవి అండతో సినిమాల్లోకి వచ్చిన కూడా సొంతంగా అభిమానుల హృదయాలను పోగేసుకుంటూ పాపులర్ అయ్యారు.. ఇంకా చెప్పాలంటే నటన వాళ్ళ బ్లడ్ లోనే ఉంది.. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాలు చేసిన ఘనత ఒక్క చిరంజీవి కి దక్కింది.. ఇకపోతే ఆ కుటుంబం లోని ప్రతి ఒక్కరూ నటన తో అభిమానుల మనసును చూరగొన్నారు.. ఎవరికి వారే అన్నట్లు వరుస సినిమాలలో  నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. దాంతో పాటుగా ఎన్నో  సినిమాలకు అవార్డులను కూడా అందుకున్నారు.. 

 

 

 

 

 

విషయానికొస్తే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.. మొదటి సినిమా అయినా రామ్ చరణ్ బాగా చేశాడు.. దీంతో దర్శక నిర్మాతల చూపును తన వైపు లాక్కున్నాడు.. అయితే  ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేక పోయిన కూడా మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా హిట్ అయింది.. దీంతో చరణ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. అయితే చెర్రీకి హిట్ నీ అందించిన సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం..

 

 

 

చరణ్ సినీ జీవితంలో ఎన్నో సినిమాలు మంచి హిట్ నీ అందుకోవడమే కాకుండా హీరో కు వరుస సినిమా అవకాశాలు అందించాయి.. చిరుత సినిమా తో మొదలుకొని ఎన్నో హిట్ సినిమాలలో  నటించిన ఘనత రామ్ చరణ్ అందుకున్నారు.. ఇకపోతే చరణ్ సినిమాలలో ముఖ్యంగా హిట్ నీ అందుకున్న సినిమాలు అంటే రచ్చ.. మగధీర.. నాయక్ ..సినిమాలు ఒక ఎత్తైతే ఆ తర్వాత వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా రంగస్థలం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఆ సినిమా సుకుమార్ దర్శత్వంలో రూపొందింది.. సమంత హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా లో చెర్రీ పాత్రకు మంచి మార్కులు పడటంతో సినిమా సూపర్ హిట్ అయింది.. రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ సైరా సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: