సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత  చెత్త సినిమాల్లో మొదటి స్థానం లో ఉంటుంది ఇంటిలిజెంట్. ఒకప్పుడు ఇండీస్ట్రీ హిట్స్ ఇచ్చినటు వంటి స్టార్ డైరెక్టర్  వివి వినాయక్  ఈ సినిమాకు దర్శకుడు. వినాయక్ నుండి ఇలాంటి సినిమా వస్తుందని ఎవరు ఊహించివుండరేమో. ఈసినిమా దెబ్బకు ఆయన డైరెక్షన్ కూడా మానేశాడు. ఈ సినిమా కేవలం రెండో రోజులు మాత్రమే  థియేటర్లలో ఉందంటే  టాక్ ఎలా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే  హిందీ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా బాగానే నచ్చినట్లుంది.  గత ఏడాది ఇంటిలిజెంట్ ను హిందీ లోకి డబ్ చేసి ఆదిత్య మూవీస్ యూ ట్యూబ్ లో విడుదలచేయగా నిన్నటి తో ఈ సినిమా 75 మిలియన్ వ్యూస్ ను రాబట్టుకుంది. మరి ఈ రేంజ్ లో చూడడానికి ఈసినిమా లో నార్త్ వాళ్లకు ఏం నచ్చిందో..  
 
ఇదిలావుంటే ప్రస్తుతం సాయి ధరమ్, సుబ్బు డైరెక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం మే 1న విడుదలకావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. త్వరలోనే  పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి  జూలై లేదా ఆగస్టు లో సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రంలో నాబా నటేష్ హీరోయిన్ నటిస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈసినిమా తరువాత సాయి ధరమ్ తేజ్ , దేవాకట్టా డైరెక్షన్ లో నటించనున్నాడు.  
 
ఇక ఇంటిలిజెంట్ తరువాత వివి వినాయక్ హీరోగా మారి సీనయ్య అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈసినిమా మధ్యలోనే ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సివుంది. దిల్ రాజు ఈసినిమాకు నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: