సెంటిమెంట్, మాస్, గ్లామర్, భక్తి.. ఇలా అన్ని జోనర్లను సమర్ధవంతంగా తెరకెక్కించే దర్శకుడు ఎవరనే ప్రశ్నకు తిరుగులేని సమాధానం కె.రాఘవేంద్రరావు అంటే అతిశయోక్తి కాదు. శతాధిక చిత్రాల దర్శకుడిగా అన్ని రకాల సినిమాలకు కొత్త అర్ధాలు చెప్పిన దర్శకుడు ఆయన. దర్శకేంద్రుడు అనే బిరుదుతో తెలుగు సినిమాలను నెంబర్ వన్ దర్శకుడిగా ఏలారు. దర్శకుడిగా ఆయన ప్రస్థానం మొదలై మే2వ తేదీకి 45 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1975లో శోభన్ బాబు హీరోగా తెరకెక్కించిన ‘బాబు’ ఆయన మొదటి సినిమా.

IHG

 

కెరీర్లో ఆయన చూడని బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు లేవు. హిరోయిన్ల అందాన్ని చూపించడంలో ఆయన మార్కే వేరు. బిఏ.. అనే ఆయన డిగ్రీ సినిమా భాషలో బొడ్డు, ఆపిల్స్ గా మరిపోయిందంటే ఆయన ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ తో తీసిన అడవిరాముడుతో మాస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ‘ఆరేసుకోబోయి.. పారేసుకున్నాను..’ పాటకు తెరపై డబ్బులు పడ్డాయంటే అదంతా ఆయన దర్శకత్వ ప్రతిభే. చిరంజీవితో తీసిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సోషియో ఫాంటసీ సినిమాల్లో క్లాసిక్ వండర్ గా నిలిచిపోయింది. చిరంజీవి హీరోయిజంతో పాటు శ్రీదేవిని నిజమైన దేవకన్యలా చూపించడంలో ఆయన ప్రతిభ అసామాన్యం.

IHG's Special Care For Chiru

 

నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామదాసు తీసి ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. కుటుంబ కథగా చెప్పాలంటే పెళ్లిసందడి సినిమా ఓ ఉదాహరణ. ఆ సినిమాతో కామెడీని, ప్రేమను సమపాళ్లలో చూపించారు. ఘరానామొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడులో, అల్లుడుగారు.. ఇలా అందరి హీరోలతో ఆయన క్రియేట్ చేసిన వండర్స్ ఎన్నో. వెంకటేశ్, మహేశ్, అల్లు అర్జున్ లను హీరోలుగా పరిచయం చేశారు. కెరీర్ 45 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, హీరోలకు, హీరోయిన్లకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: