దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం గత మార్చి నెల నుంచి మొదలైంది.  మొదట విదేశీయుల నుంచి ఈ కరోనా వ్యాప్తి జరిగిందని చెప్పినా తర్వాత లోకల్ గా మొదలైంది.  ఆ తర్వాత ఢిల్లీలోని ముజాహిద్దీన్ మర్కజ్ ప్రార్థనా సమావేశాల్లో పాల్గొన్న వారి వల్ల కరోనా విస్తరిస్తుందని అన్నారు.  ఏది ఏమైనా ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రతిరోజూ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.  ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యమైన అమెరికా లో మరణ మృదంగం వాయిస్తుంది.  ఇప్పటికే అక్కడ 60వ వేలకు పైగా మరణాల సంబవించాయి.. ఇక ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశంలో దారుణంగా మరణాలు సంబవించాయి.  

 

 

మన దేశంలో కరోనా వ్యాప్తి జరుగుతున్న సమయంలో మార్చి 24 న లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి అన్ని సినీ పరిశ్రమలో షట్ డౌన్ అయ్యాయి.  దాంతో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి విషయం పక్కనబెడితే.. సినీమాలపై పెట్టుబడి పెట్టిన నిర్మాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు  కరోనా ప్రభావం సినీ రంగంపై మరికొంత కాలం పాటు ఉంటుందని నిర్మాత సురేశ్ బాబు అన్నారు. ఈ మహమ్మారి వ్యాప్తి ఎలా ఉండబోతుందో చెప్పలేమని తెలిపారు.

 

పరిశ్రమ నష్టాల్లో ఉన్న ఈ సమయంలో హీరో, హీరోయిన్లు, దర్శకులతో పాటు అందరూ పారితోషికాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.   ఇప్పడున్న పరిస్థితిలో విడతలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసినీ.. థియేటర్లు ఓపెన్ అవుతాయన్న నమ్మకం కూడా లేదు.  ప్రస్తుతం కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయని... ముందు వాటిని పూర్తి చేసుకుంటే కొంత డబ్బు సంపాదించుకోవచ్చని చెప్పారు.  కరోనాని పూర్తిగాగా అంతం చేసేందుక  వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇబ్బందులు తప్పవని సురేశ్ బాబు తెలిపారు. చిన్న సినిమా షూటింగులు జరగొచ్చని... ఎక్కువ మంది ఆర్టిసులు అవసరమయ్యే సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం ఇబ్బంది పడొచ్చని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: