టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్న వారిలో ఆర్తి అగర్వాల్ ఒకరు. ఆమె సినిమాలు ఆమె కెరీర్ లో చూపించిన దూకుడు అన్నీ కూడా ఒకప్పుడు సంచలనం. అయితే కెరీర్  పీక్ దశలో ఉన్నప్పుడు కొన్ని ప్రచారాలు, కొన్ని నమ్మకాలు, కొన్ని వ్యవహారాలూ అన్నీ కూడా ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయి అనేది వాస్తవం. ఆమె కెరీర్ లో చేసిన చిన్న చిన్న తప్పులు ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయి అనేది వాస్తవం. ఆమె అనవసరంగా కొందరిని నమ్మి బాగా మోసపోయింది అని చెప్తూ ఉంటారు. 

 

ఆమె తో పాటు కెరీర్ మొదలుపెట్టిన ఒక యువ హీరోతో ఆమె ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది అని ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని భారీగా అతని కోసం ఖర్చు చేయడం అన్నీ కూడా అప్పట్లో వివాదాస్పదమే. మీడియా కూడా ఆమె గురించి చాలా కథనాలు అప్పట్లో రాస్తూ ఉండేది. వాస్తవం ఉన్నా లేకపోయినా సరే మీడియాలో మాత్రం ఆమె గురించి చాలా వార్తలు వచ్చేవి. ఇక ఆమె నమ్మి మోసపోవడం ఆ తర్వాత అవకాశాల కోసం ఆమె తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళడం బరువు తగ్గాలి అనుకోవడం అన్నీ కూడా ఆమె కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. 

 

బరువు తగ్గే క్రమంలోనే ఆమె ప్రాణాలు కూడా కోల్పోయింది. ఆమె ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం అప్పుడు రాలేదు. అగ్ర హీరోలతో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నా సరే ఆమె మాత్రం నిలబెట్టుకోవడం లో ఘోరంగా విఫలమయ్యారు అని అంటారు. వారు కూడా ఒకానొక దశలో ఆమెను ఆదుకోలేదు అని అంటూ ఉంటారు. ఆమె చివరికి ఎం చెయ్యాలో అర్ధం కాక ఆత్మహత్య చేసుకుంది అని కూడా అనే వాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: