ప్రస్థుతం ఇండస్ట్రీ వ్యవహారాలు అంతా ‘ఆర్ ఆర్ ఆర్’ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ మూవీ విడుదలను బట్టి మిగతా టాప్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ నిర్ణయమే కాకుండా కరోనా సమస్య తరువాత విడుదల అయ్యే భారీ సినిమాలకు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి జరగబోయే బిజినెస్ ను ఆధారంగా చేసుకుని బిజినెస్ జరుగుతుంది అన్న అంచనాలు ఇండస్ట్రీ వర్గాలలో వస్తున్నాయి. 


అయితే లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు సడలిస్తున్నా సినిమాల షూటింగ్ లలో మాత్రం ఎప్పుడు ఆంక్షలు తొలిగిస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుందా అన్నవిషయం ఆఖరికి రాజమౌళికి కూడ తెలియని పరిస్థితి. 


ఇలాంటి పరిస్థితులలో ఈ కన్ఫ్యూజన్ హారికా హాసినీ సంస్థ ఎన్టీఆర్ త్రివిక్రమ్ లతో తీయబోతున్న మూవీ పై ఉండటంతో గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ జూనియర్ ల మధ్య ఈ విషయమై చాల సీరియస్ చర్చలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి కావడానికి ఇంకా కనీసం ఆరు నెలలు పైగా సమయం పట్టే పరిస్థితులలో అప్పటి దాకా వేచి ఉండకుండా త్రివిక్రమ్ షూటింగ్ లు మొదలయ్యాక వెంకటేష్ తో ఒక సినిమాను చాల వేగంగా తీస్తాను అని జూనియర్ కు చెపుతున్నట్లు టాక్. 


అయితే ఈ సూచనకు జూనియర్ విభేదిస్తూ ‘అల వైకుంఠ పురములో’ తరువాత త్రివిక్రమ్ చేయబోయే మూవీ తనతోనే ఉండాలి కాని మరొక హీరోతో ఉండకూడదు అని జూనియర్ త్రివిక్రమ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో త్రివిక్రమ్ జూనియర్ మాటలను తీసివేయలేక ఇంకా ఆరు నెలలుకు పైగా జూనియర్ కోసం ఖాళీగా ఉండలేక ‘అల వైకుంఠపురములో’ మూవీతో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్నాను అంటూ త్రివిక్రమ్ ఏదోవిధంగా తారక్ ను ఒప్పించడానికి తన మాటల గారడీ ప్రయోగిస్తున్నట్లు టాక్..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: