టాలీవుడ్ లో కమెడియన్ అనగానే చాలా మందికి కొన్ని పేర్లు, కొన్ని రూపాలు కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకునేది రాజబాబు. ఆయన సినిమాలు ఆయన చేసిన కామెడి సన్నివేశాలు, ఆయన పోషించిన కామెడి పాత్రలు ఎవరూ కూడా టాలీవుడ్ లో చేయలేదు అనేది వాస్తవం. కామెడి అంటే రాజబాబు అని చెప్తూ ఉంటారు పెద్దలు. ఎలాంటి కామెడి సన్నివేశం అయినా సరే ఆయన ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది అప్పటి ప్రేక్షకుల్లో. రాజబాబు కోసం ప్రత్యేకంగా కొన్ని పాత్రలను రాసుకునే వాళ్ళు. 

 

అగ్ర దర్శకులు అగ్ర హీరోలు అందరూ కూడా ఆయనతో సినిమా చెయ్యాలి అనుకున్న వాళ్ళే. ఆయన కోసం రాసుకున్న పాత్రలు ఏ ఒక్కరికి కూడా మ్యాచ్ అయ్యేవి కాదు. ఆ విధంగా రాజబాబు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో ఆయన చేసిన పాత్రలు ఎవరూ చేయలేదు అనేది వాస్తవం. ఆయన నోటి నుంచి వచ్చే మాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకునే వారు. ఆయన మాట్లాడే ప్రతీ మాట కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతూ ఉంటుంది అంటారు. అగ్ర హీరోలు అయితే ఆయన కోసం ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

 

అయితే సంపాదించుకున్న దానిలో ఆయన రూపాయి కూడా ఆదా చేసుకోలేదు అనేది టాలీవుడ్ జనాల మాట. అగ్ర హీరోలతో అయినా చిన్న హీరోలతో అయినా సరే ఆయన సినిమా చేస్తే దానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆయన పాత్రల మీద దర్శకులు ప్రత్యేక దృష్టి పెట్టే వారు. ఎలాంటి సన్నివేశంలో అయినా సరే ఆయన జీవించే వారు. ప్రతీ పాత్రకు ప్రాణం పోసే విధంగా కామెడిని పండించారు ఆయన. ఆయన కెరీర్ లో శోభన్ బాబు, ఎన్టీఆర్, అక్కినేని కృష్ణ వంటి వారి పక్కన నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: