బాలీవుడు పింక్ సినిమా తెలుగు రీమేక్ వకీల్ సాబ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నాడు. ఒక కేసు విషయంలో నలుగురు అమ్మాయిల తరపున వాదించే లాయరుగా పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నాం. నలుగురు అమ్మాయిల్లో ఒకరిగా నివేథా థామస్ నటిస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పవన్ భారీ పారితోషికం తీసుకుంటున్నాడని టాక్.

 


పవన్ కళ్యాణ్ ఛరిష్మాకి దిల్ రాజు భారీ పారితోషికాన్ని ముట్టజెప్పనున్నాడని అంటున్నారు. ఈ ఒక్క సినిమానే కాదు పవన్ లైన్లో పెట్టిన మూడు సినిమాలకి కూడా రెమ్యునరేషన్ భారీగానే ఉందని అంటున్నారు. అయితే కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆల్రెడీ సినిమాలు తీసి విడుదలకి రెడీగా ఉన్న వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. అదీగాక థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి.

 

ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో హీరోల పారితోషికం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా వచ్చిన తర్వాత ఆర్థికంగా బాగా దెబ్బతినడంతో ఇంతకుముందు ఇచ్చినంత పారితోషికాలు ఇవ్వలేరు. అదీగాక సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకుని సినిమాలు చేయాల్సి ఉంటుంది. మరి ఇలాంతి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పారితోషికం తగ్గించుకుంటాడా అన్న చర్చ జరుగుతుంది.

 

 

ఇప్పటికి మూడు సినిమాలని ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ మునుపటి కంటే తన రెమ్యునరేషన్ ని తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. ఈ విపత్కర పరిస్థితిలో ఇండస్ట్రీ అండగా నిలవడానికి తన రెమ్యునరేషన్ ని తగ్గించుకుంటాడని అంటున్నారు. సినిమా ఫ్లాప్ అయినపుడు తన రెమ్యునరేషన్ ని తగ్గించుకునే పవన్ కళ్యాణ్ ఇలాంటి టైమ్ లో ఖచ్చితంగా తగ్గించుకుంటాడని అంటున్నారు. మరి చూడాలి భవిష్యత్తులో ఏం జరగనుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: