టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన నటుల్లో ఎమ్మెస్ నారాయణ ఒకరు. ఆయన కామెడి టాలీవుడ్ చరిత్రలో అలా నిలిచిపోయింది. ఈ తరానికి పెద్దగా ఆయన కామెడి గురించి తెలియదు గాని కిందటి తరానికి అయితే ఆయన నటన గురించి అవగాహన ఉంది. తండ్రి గా ఆయన తాగుబోతు పాత్రల్లో నటించిన నటన అలా నిలిచిపోయింది. ఏ సన్నివేశంలో అయినా సరే ఇబ్బ౦ది పడకుండా నటించిన ఆయన టాలీవుడ్ లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఏవీఎస్, ఎల్బీ శ్రీరాం తో కలిసి ఆయన మంచి పాత్రలు చేసారు. 

 

అగ్ర హీరోల సినిమాల్లో ఆయన పాత్రకు మంచి గుర్తింపు ఉండేది. బ్రాహ్మణా పాత్రల్లో ఆయన నటన చాలా బాగా ఆకట్టుకుంటుంది. అలాగే తాగుబోతు పాత్రలను కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చేసారు ఆయన. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన పాత్రలకు ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చే వారు. ఆయన లేని సినిమా ఉండేది కాదు ఇక సునీల్ తో బ్రహ్మానందం తో ఆయన చేసిన పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చిన్న చిన్న సినిమాల్లో కూడా ఆయన కామెడి ఎక్కువగా హైలెట్ అయ్యేది.

 

చిన్న చిన్న హీరోల సినిమాల్లో ఆయన ఉంటే హిట్ అవుతాయి అనే భావన ఉండేది. అగ్ర హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ సినిమాల్లో ఆయన మంచి పాత్రలు చేసే వారు. నితిన్ సినిమాలో కూడా ఆయన మంచి పాత్రలు చేసారు. ఈ తరం హీరోలతో ఆయన పెద్దగా పని చేయలేదు గాని గతంలో అగ్ర హీరోల సినిమాల్లో కాలేజి ప్రొఫెసర్ గా మంచి పాత్రలు చేసి కామెడి పండించే వారు. ఆయన కోసం ప్రత్యేక సన్నివేశాలు కూడా రాసారు. ఆయన మరణం కామెడి ప్రపంచానికి ఎప్పుడు కూడా తీరని లోటు అని సిని పండితులు వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: