పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే మెగా, పవర్ స్టార్ అభిమానుల కోలాహలం, సందడి ఎలా ఉంటుందో తెలిసిన విషయమే. పవన్ కొత్త సినిమా స్టార్ట్ అయిన నాటి నుంచే బిజినెస్ వర్గాల్లో క్రేజ్ క్రియేట్ అవుతుంది. పవన్ మ్యాజిక్ ఏంటంటే రిజల్ట్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ కలెక్షన్లు, వీకెండ్ కలెక్షన్లు విషయంలో పవన్ మార్క్ మ్యాజిక్ ఎప్పుడూ ఉంటుంది. అటువంటి మ్యాజిక్ చేసిన పవన్ సినిమాల్లో బంగారం కూడా ఒకటి. నేటితో ఆ సినిమా రిలీజ్ అయ్యి 14 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

పవన్ సినిమాలో కంటెంట్ ఉంటే ఇక ఆ సినిమా తిరుగేలేని రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిన విషయమే. కానీ.. 2006 మే3న విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. కానీ.. పవన్ మార్క్ ఓపెనింగ్ రికార్డులు, వీకెండ్ టాప్ కలెక్షన్లు కూడా వసూలు చేసింది. సినిమాలో పవన్ జర్నలిస్టుగా, ఫ్యాక్షన్ మూలాలు ఉన్న ఊరి సమస్య, ఓ అమ్మాయి ప్రేమను కలిపే పాత్రలో నటించాడు. ఈ సినిమాలో పవన్ కు హీరోయిన్ ఉండదు. రీమా సేన్, మీరా చోప్రా ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమాపరంగా ఆకట్టుకునే కథాంశం బంగారంలో ఉంది. ఈ సినిమా 5 సెంటర్లలో 100 రోజలు ఆడింది.

IHG

 

ఏఎం రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడు ధరణి ఈ సినిమాను తెరకెక్కించాడు. విద్యాసాగర్ అందించిన సంగీతంలోని పాటలు కూడా హిట్ అయ్యియి. ‘ఎగిరే చిలకమ్మా..’, 'బంగారం..' టైటిల్ సాంగ్ ఆడియో, విజువల్ గా కూడా హిట్ అయ్యాయి. సినిమాలోని క్లైమాక్స్ సీన్ లో త్రిష అతిథి పాత్రలో మెరుస్తుంది. ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి తమిళ స్టార్ నటుడు విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగా ఫ్యాన్స్ కి ఈ సినిమా ఇప్పటికీ ఐ ఫీస్ట్ అని చెప్పాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: