తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో  ఉదయ్ కిరణ్. యువ హీరోగా లవర్ బాయ్ గా  మాస్ హీరోగా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యి  తమ సొంత ఇంటి వాడిలా మారిపోయాడు ఉదయ్ కిరణ్. ఇక తెలుగు పరిశ్రమలో ఉదయ్ కిరణ్ నటించిన ఎన్నో సినిమాలు మైలురాళ్లుగా మిగిలిపోయాయి అనే చెప్పాలి. తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఉదయ్ కిరణ్. ఇక ఉదయ్ కిరణ్ నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. 

 

 

 ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ఎంతగానో క్రేజ్ సంపాదించుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లపాటు టాప్ హీరోగా దూసుకుపోయాడు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు బాగా ఆడకపోవడం మొదలయ్యింది. ఎలాంటి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేక్షకుల ఆదరణ మాత్రం కరువైంది. ఇలా ఎన్ని సినిమాలు చేసిన విజయం సాధించకపోవడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఉదయ్ కిరణ్ తన సినిమాలను తానే నిర్మించుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కూడా పెద్దగా ఆడలేదు. దీంతో ఉదయ్ కిరణ్ తీవ్రంగా నష్టపోయారు. 

 

 

 ఇక ఆ తర్వాత చాలా రోజుల పాటు ఎక్కడ  తెరమీద కనిపించని ఉదయ్ కిరణ్... ఆ తర్వాత తన అపార్ట్మెంట్లో ఉరివేసుకొని చనిపోవడం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ను ఒక్కసారిగా విషాదం లో నెట్టింది . యువ హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించిన ఉదయ్ కిరణ్.. అపార్ట్మెంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడటంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు షాక్కి గురయ్యింది . ఉదయ్ కిరణ్ మరణంతో అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఉదయ్ కిరణ్ మరణించి ఉంటాడని కొంతమంది అంటే ఇంక వేరే కారణాల వల్ల కూడా మరణించి ఉంటాడని మరికొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: