టాలీవుడ్ లో ఇప్పుడు యువ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతలు గా హీరోలు గా వాళ్ళ హడావుడి మాములుగా లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఇప్పుడు లాక్ డౌన్ లో ఖాళీ గా ఉన్న హీరోలు అందరూ కూడా కొత్త ప్లాన్స్ ఎక్కువగా చేస్తున్నారు. ప్రేక్షకులకు దగ్గర కావడానికి గానూ తమ వంతుగా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని సమాచారం. ఇప్పుడు అతను తన తండ్రి దర్శకుడు కొరటాల శివ తో కొన్ని చర్చలు జరుపుతున్నాడు. 

 

తన పాత్రకు సంబంధించి ఇప్పటికే కొరటాల కథలో మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కథ లో తాను మరో హీరో ని కూడా కావాలని అంటున్నాడని సమాచారం. ఆచార్య సినిమాలో ఎన్టీఆర్ ని కూడా చూపించే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. మరి అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూస్తే ఇప్పటికే ఎన్టీఆర్ తో కూడా రామ్ చరణ్ చర్చలు కూడా జరిపాడు అని సమాచారం. దీనికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే దీనికి సంబంధించిన షూటింగ్ ని కూడా త్వరలో కొంత భాగం పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఒక ఆఫీసర్ హోదా లో ఉంటుందని హైదరాబాద్ లో ఉండే ఆఫీసర్ గా ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి షూటింగ్ ని ఏ ఇబంది లేకుండా పూర్తి చేస్తే త్వరగా దానికి సంబంధించి లుక్ ని కూడా విడుదల చేయవచ్చు అని రామ్ చరణ్ భావిస్తున్నట్టు సమాచారం. దీనికి ఎన్టీఆర్ ఏమీ పెద్దగా డిమాండ్ చేయలేదు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇది సినిమాలో ఉంటే మాత్రం హైలెట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: