టాలీవుడ్ లో యువ హీరోల్లో రానా ఆలోచన చాలా వరకు భిన్నంగా ఉంటుంది. అందరూ చేసే విధంగా అతను చేసే అవకాశం ఉండదు. ఏదోక విధంగా అతను ప్రేక్షకులకు వినోదం అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం రానా ఒక సినిమా చేస్తున్నాడు. అరణ్య అనే సినిమా ఫస్ట్ లుక్ తో పాటుగా కొన్ని సీన్స్ ని కూడా విడుదల చేసారు. ఇందులో రానా అడవి మనిషి గా నటిస్తున్నాడు. అడవి మనిషి గా రానా అరుపులు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. రానాసినిమా కోసం ఎక్కువగానే కష్టపడి తనలో తాను చాలా మార్పులు కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. 

 

ఇప్పుడు ఈ సినిమా తర్వాత అతను విరాట పర్వం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అతను బాలీవుడ్ లో ఒక సినిమాను చేసే అవకాశం ఉందని సమాచారం. అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని రానా మాత్రం ఇప్పుడు చాలా వరకు కష్టపడుతున్నాడని ఆ సినిమా కోసం టాలీవుడ్ వర్గాలు అంటున్నారు. టాలీవుడ్ లో రానా కు మంచి క్రేజ్ ఉంది గాని హడావుడి చేసే ఫాన్స్ ఉండరు. అతని సినిమాలకు ముందు నుంచి ఒక క్రేజ్ ఉంటుంది. అందుకే అతని తో సినిమా చేయడానికి బాలీవుడ్ జనాలు ఆసక్తి చూపిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

రానా చేసే సినిమాలో ఒక బాలీవుడ్ అగ్ర హీరో ఉంటాడు అని అంటున్నారు. ఆ సినిమాలో అతను విలన్ గా నటించే అవకాశం ఉందని సమాచారం. సల్మాన్ ఖాన్ హీరోగా ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి అంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: