టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న వారికి ఇప్పుడు దాదాపుగా లేదు అనే మాట అక్షరాల నిజం. వారు సినిమాలు చెయ్యాలి అనుకున్నా సరే వారికి అవకాశం ఇవ్వడానికి చాలా మంది ముందుకు రావడం లేదు. అందులో క్రిష్ కూడా ఒకరు. ఆయన ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఏ సినిమా చెయ్యాలో అర్ధం కాక చాలా బాగా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. మంచి కథ ఉన్నా సరే చాలా మంది ఆయన తో సినిమా చేయడానికి ముందుకు రాలేదు అనేది వాస్తవం. అప్పటి నుంచి ఖాళీ గా ఉండి ఆయన పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. 

 

సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చెయ్యాలని క్రిష్ అనుకున్నా అది దాదాపుగా సాధ్యం కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్  తర్వాత ఆయన ఒక యువ హీరో తో సినిమా చెయ్యాలి అని చూసినా సరే మంచి అవకాశం మాత్రం రాలేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం క్రిష్ చేస్తున్న సినిమాను వచ్చే ఏడాది తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత అతను చేసే సినిమా మీద ఇప్పటి నుంచే ప్లన్స్ చేస్తున్నాడు. 

 

అయితే అవకాశం ఇవ్వడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. రామ్ చరణ్ లేదా చిరంజీవి తో ఒక సినిమా చేసే ఆలోచన క్రిష్ చేస్తున్నాడు. మరి అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతం క్రిష్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమాలో రామ్ చరణ్ ఉండే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి రామ్ చరణ్ ఉంటాడా లేదా అనేది చూడాలి. ఎన్టీఆర్ తో సినిమా కూడా అతను రెడీ అవుతున్నాడని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: