ఒక్క సినిమా వచ్చినా చాలు అనేది ఇప్పుడు టాలీవుడ్ జనాలు ఆశగా ఎదురు చూస్తున్న పరిణామం. ఒక్క సినిమా వచ్చినా చాలు అనుకుని కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగులో ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. దీని తో చిన్న చిన్న సినిమాలను లైన్ లో పెట్టాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక యువ హీరో సినిమాను కొనడానికి గానూ మహేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా అమ్మడానికి నిర్మాత రెడీ గా ఉంటే తాను సినిమాను కొంటా అని కూడా మహేష్ బాబు స్పష్టంగా చెప్పారని సమాచారం. 

 

యువ హీరోలు ఆదరణ ఉన్న వారి సినిమాలు చేసే ఆలోచనలో ఉన్న మహేష్ బాబు. ఇప్పుడు ఒక హీరో సినిమాను కొని దాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదల చెయ్యాలి అని భావిస్తున్నాడు. అతనే రాం... రామ్ హీరో గా వచ్చిన రెడ్ సినిమాను గత నెలలో విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఆ సినిమాను కొనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నాడని అంటున్నారు. మరి ఆ సినిమా వస్తుందా లేదా అనేది చూడాలి. ఆ సినిమాను ఆ ఫ్లాట్ ఫాం మీద విడుదల చేయడానికి తాము సిద్దంగా లేము అని చెప్పారట. 

 

అయినా సరే తాను మంచి ధర ఇచ్చి కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. రామ్ చరణ్ కూడా ఒక సినిమాను కొనడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా సినిమాలు ఇప్పుడు విడుదల చేసే అవకాశం లేదని అంటున్నారు. అందుకే కథ బాగున్న సినిమాలను కొనుగోలు చెయ్యాలి అని సూచిస్తున్నారట. మరి ఏ సినిమాలను హీరోలు కొనుగోలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: