వరస పరాజయలతో సతమతమవుతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్తవారికి కాకుండా ఫామ్ లో వున్న డైరెక్టర్ లకు మాత్రమే ఓకే చెప్తున్నాడు. అందులో భాగంగా విజయ్, ఫైటర్ తరువాత నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణతో సినిమా చేయానికి ఓకే చెప్పాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మించాల్సి వుంది అయితే ఇప్పుడు ఈసినిమా మైత్రి కి ఒదిలేశారట. నిజానికి మైత్రి తో విజయ్, హీరో సినిమా చేయాల్సి వుంది. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది అయితే అవుట్ ఫుట్ నచ్చకపోవడంతో సినిమాను మధ్యలోనే ఆపేశారు. దానికి ప్రతిఫలంగా ఈ సినిమాను మైత్రికి ఇచ్చేశారట. 
 
ఇక తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో  విజయ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది. ఇదిలావుంటే విజయ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్ లో నటిస్తున్నాడు. ఇటీవలే ముంబై లో రెండు కీలక షెడ్యూల్ లను పూర్తి చేసుకుంది. మొదటిసారి విజయ్ -పూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం తో ఫైటర్ పై  భారీ అంచనాలు వున్నాయి.  
 
 బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో  అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా రోనిత్ రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. తెలుగు తోపాటు హిందీలోనూ ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి ,ఛార్మి తో కలిసి కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. హిందీలో విజయ్ కి ఇదే మొదటిసినిమా కాగా  ఈసినిమాపై అతను భారీఆశలు పెట్టుకున్నాడు. ఈఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకులముందుకురానుంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: