చిత్ర పరిశ్రమలోని హీరోలు చాలా వరకు అభిమానులతో వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తారు..వారి ఆహారపు అలవాట్లు కానీ డ్రెస్సింగ్ గురించి కానీ ఇలా ఒక్కో విషయాన్ని తెలియజేస్తూ అభిమానుల్లో వారి క్రేజ్ ను పెంచుకుంటూ వస్తున్నారు.. సినిమాల కన్నా కూడా ఎక్కువగా సోషల్ మాద్యమాల ద్వారా వారి పర్సనల్ విషయాలను పంచుకుంటూ వస్తున్నారు.. అలాగే సినీ ప్రేక్షకులు కూడా తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. 

 

 

 

అసలు విషయానికొస్తే..  కమల హాసన్ గురించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది..అదేంటంటే..సినీనటుడు విజయ్‌ సేతుపతితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడారు. తాను తినే ఆహారం విషయంలో తనను తాను నియంత్రించుకోలేనని చెప్పారు. తాను ఎలా తింటాననే విషయాన్ని తనకంటే  తనతో బాగా సన్నిహితంగా ఉండేవారే బాగా వివరిస్తారని ఆయన చెప్పారు.గతంలో ఒకసారి తాను తినే తిండి చూసి నటుడు శివాజీ విస్మయానికి గురయ్యారని కమల్ తెలిపారు. 

 

 

 

 

 

ఇకపోతే  గతంలో తాను రోజుకు 14 కిలో మీటర్లు పరిగెత్తేవాడిని, అయితే, తనకు ప్రమాదం జరిగిన తర్వాతి నుంచి తాను అంత దూరం పరిగెత్తలేకపోతున్నానని చెప్పారు. కమల్ నటించిన అభయ్ సినిమా గురించి కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.. ఆ సినిమాలో కమల్ కండలు కలిగిన వ్యక్తిగా కనిపించాలట అయితే అవి కొందరికి నచ్చేవి కాదని చెప్పుకొచ్చారు..

 

 

 

 

 

దీంతో ఆ పాత్ర కోసం తాను మాంసాహారం బాగా తీసుకున్నానని చెప్పారు. రోజుకు 32 గుడ్లు తినేవాడినని, అలాగే, చికెన్ బాగా తినేవాడినని తెలిపారు. అన్ని గుడ్లు తినే సరికి ఆ సినిమా షూటింగ్‌ ముగిసిన తర్వాత కోడి గుడ్లు అంటే కాస్త అసహ్యం తో పాటుగా విరక్తి కలిగిందని కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు..దెబ్బకు ఇప్పుడు ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్ ను తీసుకుంటారని అన్నాడు.. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లలో కమల్ హాసన్ నటిస్తున్నాడు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: