టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు పాత హీరోయిన్ లకు మంచి డిమాండ్ ఉంది. వారికి మంచి ఆఫర్లు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారు చిన్న చిన్న హీరోల సినిమాల్లో వారిని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక అగ్ర హీరోల సినిమాల్లో కూడా పాత హీరోయిన్ లకు అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు రోజా ఒక సినిమాలో నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవి హీరోగా వస్తున్న లూసిఫర్ సినిమాలో ఆమె నటించే అవకాశం ఉంది. ఆమెకు ఒక కీలక పాత్ర ఇచ్చారని అంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు... మహిళలను విలన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. 

 

రోజా కూడా ఈ సినిమాలో నటించడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇక బాలయ్య సినిమాలో మీనా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. బోయపాటి శ్రీను సినిమాలో ఆమె ఒక కీలక పాత్ర చేస్తుంది అంటున్నారు. రామ్ చరణ్ సినిమాలో కూడా ఆమె నటిస్తుంది అంటున్నారు. ప్రభాస్ సినిమాలో స్నేహా కూడా ఒక పాత్ర చేస్తుంది అని సమాచార౦. మరి చేస్తుందా లేదా అనేది చూడాలి. స్నేహా కూడా ఇప్పుడు తెలుగులో బిజీ అవ్వాలి అని భావిస్తున్నట్టు సమాచారం. యువ హీరోల సినిమాల్లో ఇప్పుడు కొందరు మాజీ హీరోయిన్ లు  చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

 

యువ హీరోల సినిమాలు ఈ మధ్య ఎక్కువగా భిన్నమైన కథల్లో వస్తున్నాయి. అందుకే లేడీ విలన్ లు అయితే బాగుంటుంది అని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత౦ మన తెలుగులో సినిమాలు అన్నీ కూడా దాదాపుగా ఆగిపోయాయి. ఏ సినిమా కూడా ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదని సమాచారం. అందుకే ఇప్పుడు కొన్ని సినిమాలకు గానూ నటులను ఎంపిక చేస్తున్నారు. యువ హీరోలు కథలు వినతూ తమ డిమాండ్ లు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: