యువ హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేకుండా కథలు బాగున్నాయి అంటే సినిమాలను నిర్మించే ఆలోచన చేస్తున్నారు అనే విషయం కొన్ని రోజులుగా ప్రచారం లో ఉంది. మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టిన హీరోలు అందరూ కూడా ఇదే ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్ర హీరోలు అందరూ ఇప్పటికే నిర్మాతలు గా తమ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్న హీరోలు కూడా నిర్మాతలుగా ప్రయత్నం చేస్తున్నారు ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. టాలీవుడ్ లో మహేష్ బాబు క్రేజ్ తెలిసిన జూనియర్ ఎన్టీఆర్... 

 

మహేష్ సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. మహేష్ బాబు ఇప్పుడు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తాను నిర్మించాలి అనే భావన లో తారక్ ఉన్నాడు. వేరే నిర్మాత ఉన్నా సరే తాను పెట్టుబడి పెట్టడానికి గానూ చర్చలు జరుపుతున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కథ అతనికి బాగా నచ్చింది అని అందుకే పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నాడు అని అంటున్నారు. తన తండ్రి తన కొడుకుల పేరు మీదుగా ఒక నిర్మాణ సంస్థను లాంచ్ చెయ్యాలి అని భావిస్తున్నాడు. 

 

ఈ నిర్మాణ సంస్థ ద్వారా మహేష్ బాబు సినిమాను నిర్మించాలి అని భావిస్తున్నాడు. వచ్చే ఏడాది మరో సినిమాను కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. దీనిపై ఇప్పటికే టాలీవుడ్ లో చర్చలు కూడా జరుగుతున్నాయి త్వరలో ఈ సినిమాకు నిర్మాతగా ఎన్టీఆర్ ని మహేష్ బాబు ప్రకటించే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమాకు సంబంధించి... చర్చలు కూడా దాదాపుగా పూర్తి చేసారని అంటున్నారు. త్వరలో దీని పై ఎన్టీఆర్ కథ కూడా వినే అవకాశం ఉందని సమాచారం. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: