ప్రస్తుతం లాక్ డౌన్ వేళ ఇంటికే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఉగాది పండగ సందర్భంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన చిరంజీవి.. ఆ తర్వాత ఎంతో యాక్టివ్‌గా తనకు సంబంధించిన విషయాలను సోసల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు సమాజంలో జరిగే సంఘటనలను కూడా ట్విట్టర్‌ లో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29న 'అంత‌ర్జాతీయ డ్యాన్స్ దినోత్స‌వం' సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న‌కి డ్యాన్స్‌ కి త‌న‌కి ఉన్న ప్ర‌త్యేక‌మైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డాన్స్ వలన తనకు దక్కిన గౌరవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. డాన్స్ గొప్పతనాన్ని వివరిస్తూ చిరు ఇప్పటికి కూడా తాను ఒత్తిడి ఫీలైన సందర్భాలలో తన రూంలోకి వెళ్లి మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేసి ఉపశయమం పొందుతానని చెప్పారు. అంతేకాకుండా అదే రోజు సాయంత్రం ఆయన తన రీసెంట్ డ్యాన్స్ మూమెంట్ ఒకటి మీతో పంచుకుంటాను అని ఆయన చెప్పడం జరిగింది. కానీ అదే రోజు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అకస్మాత్తుగా మరణించడంతో చిరు ఆ డాన్స్ వీడియో విడుదల ఆపివేశారు. కాగా నేడు ఆయన సోషల్ మీడియాలో ఓ ఆసక్తిగొలిపే డ్యాన్స్‌ వీడియో పంచుకున్నారు. 

 

తాజాగా చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్‌లో మరో వీడియోను షేర్ చేసారు. 80లలో హీరో, హీరోయిన్లుగా రాణించిన వాళ్లు ప్రతి యేడాది ఒకసారి కలుసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంగా అలనాటి హీరో, హీరోయిన్లు తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా చిరంజీవి.. గతేడాది 80 యాక్టర్స్ కలిసిన వేళ.. హీరోయిన్స్ సుహాసిని, రాధ, ఖుష్బూలతో పాటు జయప్రదలతో చేసిన డాన్స్ మూమెంట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇందులో సుహాసినితో రాక్షసుడు సినిమాలోని మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాటకు డాన్స్ మూమెంట్స్ చేసారు. ఆ తర్వాత చిరు.. రాధతో మరణ మృదంగంలోని సరిగమ పదనిస పాటకు చిందేసారు. ఆ తర్వాత కుష్బూతో ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడిపెట్ట పాటకు రిథమ్ కలిపాడు. ఈ పాటకు కుష్బూతో పాటు జయప్రద,జయసుధ, లిసా తదితరులు స్టెప్పులు వేసారు. ఇప్పుడు ఈ వీడియోను చిరు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసారు. ఈ వీడియో వైరల్ గా మారింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: