టాలీవుడ్ లో అయినా తమిళంలో అయినా సరే మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది నిత్యా మీనన్. వరుసగా సినిమాలు చేసినా చేయకపోయినా సరే ఆమె సినిమాల విషయంలో ప్రత్యేక ఆసక్తి అనేది ముందు నుంచి ఉంటుంది. ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి సినిమాలకు ఆమె కొన్ని విధాలుగా సరిగా సరిపోతుంది అనే భావన లో దర్శక నిర్మాతలు ఉన్నారు. అందుకే ఆమెను దర్శక నిర్మాతలు ఈ మధ్య ఎక్కువగా తమ సినిమాల్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఇప్పుడు ఆమె తో తెలుగులో సినిమా చేయడానికి కొందరు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హీరోయిన్ గా కాదు ఆమెకు ఒక మంచి పాత్ర ఇవ్వాలి అనే ఆలోచనలో కొందరు నిర్మాతలు దర్శకులు ఉన్నారు. ఆమె వాయిస్ కి మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆమె తో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. ఎంత వరకు అది ఫలిస్తుంది అనేది చూడాలి. ఆమె సినిమాల విషయంలో ముందు నుంచి కూడా చాలా మంది ఏ పాత్ర చేస్తుంది అనే ఆసక్తి ఉంటుంది. 

 

తన డబ్బింగ్ ని కూడా తానే చెప్పుకునే ప్రయత్న౦ ఎక్కువగా చేస్తూ ఉంటుంది ఆమె. అందుకే ఆమె తో సినిమా చేయడానికి కొందరు ముందుకు వస్తారు. ఇప్పుడు చిన్న చిన్న సినిమాల్లోనే కాదు పెద్ద పెద్ద సినిమాల్లోనూ ఆమెను తీసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. ఆమెకు ఎన్టీఆర్ మహేష్ బాబు సినిమాల్లో అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది ఆ సినిమాల కోసం ఆమె ఎక్కువగా కష్టపడుతుంది ఇప్పుడు అని కూడా అంటున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చింది అని కూడా అంటున్నారు. మరి చేస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: