దాసరి మూడు అక్షరాలు. నాలుగున్నర  దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగాన్ని శాసించాయి. ఎవరి మద్దతు లేకుండా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి నాటి అగ్ర నటులను దర్శకత్వం చేసిన ఘనత దాసరిదే. ఆయనలో అద్బుతమైన నటుడు ఉన్నాడు. రచయిత, గేయ రచయిత, మాటల రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ ఉన్నారు.

 

దాసరి బహుముఖ ప్రతిభాశాలి. ఆయన తొలి సినిమా తాతామనవడు సూపర్ హిట్. ఆ తరువాత వరసగా 12 సినిమాలు బంపర్ హిట్. ఆ తరువాత కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. మళ్ళీ పుంజుకుని దాసరి టాప్ చైర్ ఎక్కేశారు.ఆయన‌ ఒకే టైంలో అటు ఎన్టీయార్, ఇటు అక్కినేని ఇద్దరి సినిమాలకు డైరెక్షన్ చేశారు. 

 

ఇక సెట్లో సినిమాలకు అప్పటికపుడు డైలాగులు రాయడం దాసరికి అలవాటు. దాన్ని అక్కినేని లాంటి సీనియర్లు కూడా అశీర్వదించి దాసరి భుజం తట్టారు. సహజసిధ్ధమైన సన్నివేశాలు, మాటలతో దాసరి తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆయన అందరి హీరోలతో  సినిమాలు చేశారు. ఆయన ఎంతో మంది కొత్త వారిని సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు.

 

ఇక రాజకీయాల్లోనూ దాసరి రాణించారు. కేంద్రంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వాన బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. దాసరి రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికై అసలైన పెద్ద మనిషి అనిపించుకున్నారు. ప్రజానాయకుడు అని కూడా పిలిపించుకున్నారు.

 

ఇక ఆయన సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన ఇంటి తలుపు అర్ధరాత్రి కూడా తెరచుకునేది. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానని చెప్పి వారి కష్టాన్ని తీర్చిన మేరు నగధీరుడు, కార్మిక బంధువు దాసరి నారాయణరావు. ఆయన‌ 1946 మే 4న పాలకొల్లులో పుట్టారు. అదే మే నెల 30న 2017లో  హైదరాబాద్ లో అనారోగ్యంతో కన్ను మూశారు. దాసరి లేనిలోటు  ఎవరూ తీర్చలేరు అన్నది నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: