నారా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ కెరియర్ లో దాదాపు 20 సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదని చెప్పాలి. నూతన దర్శకులతో నారా రోహిత్ చేసే కొన్ని సినిమాలు బాగానే ఉన్నట్టు అనిపించినా కమర్షియల్ గా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. రెండేళ్ల క్రితం వీర భోగ  సినిమాలో కనిపించిన నారా రోహిత్ తన నెక్స్ట్ సినిమాను ఎనౌన్స్ చేయలేదు. స్టోరీలు వింటున్నాడని తెలిసినా ఎవరితో చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అన్నది మాత్రం ఇంకా ఎనౌన్స్ చేయలేదు. 

 

ఇక లేటెస్ట్ గా నారా రోహిత్ క్రేజీ లుక్ ఒకటి బయటకు వచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో క్యాప్ పెట్టుకుని దిగిన నారా రోహిత్ పిక్ ఒకటి షేర్ చేశాడు. ఫోటోలో పేస్ పూర్తిగా కనబడకపోయినా మీసపుకట్టు మాత్రం కనిపించింది. నారా రోహిత్ నెక్స్ట్ చేసే సినిమాలోని పాత్ర కోసం ఈ మేకోవర్ చేసినట్టు తెలుస్తుంది. ఈమధ్య ఈ యువ హీరో కొద్దిగా బొద్దుగా మారాడన్న వార్తలు వచ్చాయి. అయితే విమర్శలకు సమాధానం ఇచ్చేలా నారా రోహిత్ కొత్త లుక్ కనిపిస్తుంది.

 

ఈ లుక్ చూసిన నందమూరి, నారా ఫ్యాన్స్ సినిమా ఎనౌన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కెరియర్ లో పదేళ్ల కెరియర్ లో కేవలం వేళ్ళతో లెక్కబెట్టే హిట్లు మాత్రమే అందుకున్న నారా రోహిత్ ఇక మీదట కథల మీద పూర్తిగా దృష్టి పెడుతున్నారని తెలుస్తుంది. ఈమధ్య కెరియర్ లో పూర్తిగా వెనుకపడ్డ ఈ హీరో కొత్తగా కనిపించి సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి నారా రోహిత్ ఈప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. రోహిత్ మాత్రం ఈసారి కొత్త లుక్ తో కొత్తగా కనిపించి అద్భుతాలు చేయాలని చూస్తున్నాడు.               

మరింత సమాచారం తెలుసుకోండి: