మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫ్యాన్స్ కి ఎంత కిక్ వస్తుందో తెలిసిన విషయమే. ఇక ఇండస్ట్రీ వర్గాల్లో, ట్రేడ్ సర్కిల్లో కూడా అంతే బజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికీ ఇదే మ్యానియా కొనసాగుతుంటే.. చిరంజీవి భీకర ఫామ్ లో ఉన్నప్పుడు పరిస్థితేంటో అర్ధం చేసుకోవాల్సిందే. మెగాస్టార్ గా చిరంజీవి ప్రభ వెలిగోతున్న దశలో జరిగిన ఓ అద్భుతానికి మరో అయిదు రోజుల్లో 30ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఆ అద్భుతమే చిరంజీవి, శ్రీదేవి జంటగా వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా.

IHG

 

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా 1990 మే9వ తేదీన విడుదలైంది. తెలుగు సినిమా వైభవాన్ని మరో మెట్టు ఎక్కించిందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా నిర్మించిన వైజయంతీ మూవీస్ ఓ అనౌన్స్ మెంట్ చేసింది. ఇప్పటివరకూ ఈ క్లాసికల్ వండర్ గురించి ఎవరికీ తెలీని విషయాలను రివీల్ చేస్తామని వైజయంతి సంస్థ ప్రకటించింది. ఈ నెల 5, 7, 9వ తేదీల్లో ఆయా వివరాలను తెలియజేస్తామని తెలపింది. నాచురల్ స్టార్ నానీ వాయిస్ ఓవర్ తో ఆ విషయాలను సోషల్ మీడియా వేదికగా రివీల్ చేస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఆ విషయాలేంటో అని అప్పుడే మెగా అభిమానుల్లో, నెటిజన్లలో ఆసక్తి మొదలైపోయింది.

IHG

 

సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే చిరంజీవి ఇమేజ్, శ్రీదేవి అందం ఈ సినిమాకు మొదటి సక్సెస్ ని ఇచ్చాయి. భారీ తుఫాను సమయంలో విడుదలైన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి 30 ఏళ్లయినా మెగా అభిమానులతో సహా తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా మర్చిపోదు. వైజయంతీ బ్యానర్ కీర్తి పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు చేర్చింది ఈ సినిమా. అశ్వనీదత్ రివీల్ చేయబోయే స్టోరీస్ కోసం మరో రోజు వెయిట్ చేయాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: