సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడిగా చిన్నతనంలోనే కెరీర్ ప్రారంభించిన మహేష్, హీరోగా మారి రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కాగా హీరోగా నటించిన మొదటి సినిమాతోనే అద్బుతమైన విజయాన్ని అందుకున్న మహేష్, ఆ తరువాత నుండి వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని నేడు టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. 

 

చూడడానికి ఆరు అడుగులకు పైగా ఎత్తు, హాలీవుడ్ హీరోల రేంజ్ కలర్, గ్లామర్ కలిగిన మహేష్ బాబు అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. మన టాలీవుడ్ తో పలు ఇతర ఇండస్ట్రీ ల్లోనూ మహేష్ కు కొందరు స్టార్స్ లో కూడా అభిమానులున్నారు. నార్త్ హీరోయిన్స్ అయితే మహేష్ బాబుతో ఒక సినిమా అవకాశం వస్తే చాలు తమ ధన్యం అయినట్లే అంటూ ఆశపడుతుంటారు. ఇటీవల ఏకంగా ఫరెవర్ డిజైరబుల్ మ్యాన్ గా బాలీవుడ్ కింగ్ ఖన్స్ సరసన నిలిచిన మహేష్ కు రోజురోజుకు క్రేజ్ మరింతగా పెరుగుతోంది. 

 

ఇకపోతే నేడు ఇద్దరు టాలీవుడ్ ముద్దుగుమ్మలు సూపర్ స్టార్ మహేష్ గురించి తమ మనసులో మాటలను చెప్పి ఫ్యాన్స్ ని ఖుషి చేయడం జరిగింది. ముందుగా నిన్న రాత్రి ఫ్యాన్స్ తో సరదాగా ట్విట్టర్ లో ముచ్చటించిన యువ భామ రాశి ఖన్నా మాట్లాడుతూ, మహేష్ గారి ప్రక్కన నటించే ఛాన్స్ కోసం తాను కూడా ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను అని చెప్పగా, మరొక భామ అయిన పూనమ్ బజ్వా కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, మహేష్ బాబు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప మనస్తత్వం గల హంబుల్ పెర్సన్ అంటూ కితాబిచ్చింది. సాధారణంగా మహేష్ గురించి తెలిసిన వారు, అలానే మహేష్ తో కలిసి పనిచేసిన వారు ఎవరైనా కూడా ఆయనలోని గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోతారని, తన సినిమా సెట్స్ లోని వారందరితో ఒక సాధారణ వ్యక్తిలా కలిసిపోయి జోకులు వేస్తూ సరదాగా వ్యవహరించే మహేష్, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారని, అందుకే ఆయన అంతపెద్ద సూపర్ స్టార్ అయ్యారని చాలామంది సినిమావారు చెపుతూ ఉంటారు.....!! 

  

మరింత సమాచారం తెలుసుకోండి: