తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఆదివారం కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 20, జగిత్యాలలో ఒక కరోనా కేసు నమోదైనట్లు తెలిపింది. రాష్ట్ర ఆర్థిక మెరుగుదలకి హైదరాబాద్ చాలా ప్రాముఖ్యమైనది. దీనితో అక్కడే ఒక్క రోజులో ఇరవై కేసులు నమోదైతే పరిస్థితి కొంచెం క్లిష్టతరం అయినట్టే.

 

ఇక దీనితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1082కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 508 కాగా కోలుకున్నవారు 545. ఆదివారం ఒక్కరోజే 46 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరణాల సంఖ్య 29కి చేరింది. ఇదిలా ఉండా కరోనా మేఘాలు తెలంగాణ ను మెల్లగా కమ్ముకుంటున్నాయి.

 

నస్థలిపురంలో మొత్తం 8 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు గుర్తించారు. హుడా సాయినగర్, సుష్మా సాయినగర్, కమలానగర్, రైతు బజార్-సాహెబ్ నగర్ రోడ్డు, ,బీ టైప్ కాలనీలు, ఎస్కేడీ నగర్, ఫేజ్-1 కాలనీ, సచివాలయనగర్ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. మొత్తం 169 మంది కుటుంబాలు హోంక్వారంటైన్లు ఉన్నట్లు పై ప్రాంతాల్లో ఉంటున్నట్లు తెలిసింది.

 

తెలంగాణలో ఇక వారం కి కరోనా పూర్తిగా అంతరించిపోతుంది అని అనుకుంటే పొరపాటే. ఒక రెండు వారల కింద సున్నా కొత్త కేసులు నమోదు చేసుకున్న ఉన్న కేరళ మరలా నేటికి కానీ కుదుట పడలేదు. ఇక్కడ తెలంగాణలో చూస్తేనేమోరోజూ అడపాదడపా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇలా అయితే రాబోయే రోజుల్లో అటు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: