ఇండియన్ సినిమాలూక వెలుగు వెలిగిన నటి శ్రీదేవి. ఆమె సినిమాలు అనగానే ఒక తెలియని క్రేజ్ అనేది అప్పట్లో జనాలకు ఉండేది. ఆమె సినిమా చూడకపోతే పాపం అని కూడా అనుకునే జనాలు ఉండే వారు ఆ రోజుల్లో అనేది వాస్తవం. పనులు మానుకుని మరీ శ్రీదేవి సినిమా చూసే వారు. అగ్ర హీరోలు అందరూ కూడా ఆమె తో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకునే రోజులు ఉండేవి అప్పట్లో. ఆ విధంగా ఆమె తన ప్రభావం చూపించింది. శ్రీదేవి లేని సినిమా అంటూ ఉండేది కాదు కొన్ని రోజులు. 

 

ఆ విధంగా ఆమె తన ముద్ర వేసుకుంది ఇండియన్ సినిమాలో. అయితే ఆమె జీవితం మొత్తం కూడా విశాదాలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు సిని జనాలు. ఆమె జీవితం ఎక్కువగా విషాదాల తోనే ఉండేది అని ఆమె ఎప్పుడు కూడా ఎక్కడా కూడా సుఖపడిన సందర్భం అనేది ఎక్కడా లేదు అని చెప్తారు. బోని కపూర్ ని ఆమె ఎప్పుడు అయితే వివాహం చేసుకుందో ఆ రోజు నుంచి కూడా ఆమె జీవితం ఒక విషాదం అని నా అనే వాళ్ళు ఆమెకు లేకుండా పోయారు అని నమ్మే వాళ్ళు కూడా లేకుండా పోయారు అని అనే వాళ్ళు. 

 

ఆ విధంగా ఆమె జీవితం కూడా అలాగే ముగిసిపోయింది. అందరూ ఉన్నా సరే ఎవరూ లేనట్టే ఆమె చనిపోయింది. ఆమె ఏ విధంగా మరణించింది అనేది ఆమె భర్త బోని  కపూర్ చెప్తే మాత్రమే తెలుస్తుంది ప్రపంచానికి గాని అప్పటి  వరకు వచ్చే ప్రతీ వార్త కూడా రూమర్ అనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఆమె సినిమాల కోసం ఎదురు చూసిన ప్రేక్షకులు ఆమె చావుని ఏ మాత్రం తట్టుకోలేక పోయారు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: