సావిత్రి... ఇప్పటి వరకు నటన అంటే సావిత్రి సావిత్రి అంటే నటన అనే విధంగానే ఆమె నటించారు మెప్పించారు. ఇండియన్ సినిమాలో ఏ ఒక్క హీరోయిన్ కి కూడా ఈ స్థాయిలో పేరు రాలేదు. ఇప్పటికి ఏదైనా నటనను పోల్చాలి అంటే మహానటి సావిత్రి లా అని అంటారు. ఆ విధంగా ఆమె పేరు సంపాదించుకుంది. జీవితంలో సినిమాకు ఆమె చేసిన న్యాయం ఏ ఒక్క నటి కూడా చేయలేకపోయింది అనేది మాత్రం వాస్తవం. తన జీవితం మొత్తం కూడా సినిమాను ఆమె ప్రేమించింది. సినిమాను అన్ని విధాలుగా ఆదరించింది అనే స్పష్టంగా చెప్పుకోవచ్చు. 

 

అయితే ఆమె జీవితంలో అన్నీ కూడా విషాదమే కనపడుతూ ఉంటుంది మనకి. చిన్న వయసులో తండ్రి లేకపోవడం ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి రావడం పెళ్లి చేసుకోవడం ఎక్కువగా విషాదం తోనే ఉంటాయి, అప్పటి వరకు ఇండియన్ సినిమాలో హీరోయిన్ అంటే అంత అందంగా ఉంటుంది అనే విషయం ఎవరికి తెలియదు. సావిత్రి అంటే అందం అందం అంటే సావిత్రి కూడా. ఆమె నవ్వు కి ఇండియన్ సినిమా ఫిదా అయిపోయింది. తమిళ సినిమా అయితే ఆమెకు రెడ్ కార్పెట్ పరిచింది అనే  మాట వాస్తవం. 

 

టాలీవుడ్ లో ఆమె లేని సినిమా కొన్ని ఏళ్ళ పాటు లేదు అనేది వాస్తవం. మన తెలుగు నటులు ఎవరు అయినా సరే సావిత్రిని చూసి నేర్చుకునే వారే అనేది వాస్తవం. ఆమె మరణం ఆమె పెళ్లి  ప్రతీ ఒక్కటి విషాదమే. ఆమె నటించిన సినిమాలు గాని ఆమెకు వచ్చిన పేరు గాని ఏ ఒక్కటి కూడా ఆమె జీవితాన్ని కాపాడలేదు అనేది మాత్రం వాస్తవం గా చెప్పుకోవచ్చు. ప్రతీ సినిమా కూడా ఆమె జీవితంలో ఒక సంచలనమే. సావిత్రి ఉంటే చాలు సినిమా హిట్...

మరింత సమాచారం తెలుసుకోండి: