దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితులలో దేశంలో జనం అంతా టివికి అతుక్కుపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో దూరదర్శన్ తిరిగి పునఃప్రసారం అవుతున్న రామానంద్ సాగర్ రామాయణాన్ని విపరీతంగా చూస్తున్నారు. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలోని ప్రజలు ఈ సీరియల్ ను కనీవిని ఎరుగని రీతిలో చూస్తున్న పరిస్థితులలో ఈ సీరియల్ కు 77 మిలియన్ వ్యూస్ వస్తూ ఉండటంతో దూరదర్శన్ రికార్డులను బద్దలు కొడుతోంది.


ఇప్పుడు ఈ రామాయణ సీరియల్ రికార్డ్ లు రాజమౌళికి ఊహించని విధంగా ఒక సరికొత్త సమస్యలను తెచ్చిపెట్టాయి. ‘బాహుబలి’ తో రాజమౌళి నేషనల్ సెలెబ్రెటీగా మారిపోవడంతో జక్కన్న పేరు ఉత్తర భారత భారతదేశంలో కూడ చాల పాపులర్. దీనితో చాలామంది ఉత్తర భారతదేశానికి సంబంధించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యూత్ ‘ రాజమౌళి రామాయణం నిర్మించు’ (#RajamouliMakeRamayan) అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి గత రెండు రోజులుగా తెగ హడావిడి చేస్తున్నారు. 


అంతేకాదు ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా తీసిన రాజమౌళి రామాయణం లాంటి గొప్ప సినిమాలను తీయాలి కానీ ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటి చిన్న సినిమాలు ఏమిటి అంటూ సెటైర్లు కూడ వేస్తున్నారు. వాస్తవానికి రాజమౌళి మహాభారతం సినిమాను 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తీయాలి అన్న కోరికతో ఉన్నాడు. 


రాజమౌళి కెరియర్ ముగిసేలోగా మహాభారతం తీయాలని ముచ్చటపడుతున్నాడు. అయితే ఉత్తర భారతదేశ సినిమా అభిమానులు మాత్రం రాజమౌళి భారీ గ్రాఫిక్స్ తో రామాయణం తీస్తే చూడాలని ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ కరోనా దెబ్బతో ఎప్పుడు పూర్తి అయి ఆ ప్రాజెక్ట్ నుండి జక్కన్న బయటకు వస్తాడో అతడికే తెలియని పరిస్థితులలో ఉత్తర భారతదేశ ప్రజల కోరికను ప్రస్తుత పరిస్థితులలో రాజమౌళి తీర్చగలడా అన్నది సమాధానం లేని ప్రశ్న..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: