తెలుగు తెర మీద తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర, తెలుగు వాడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మద్రాసీలు గానే తెలుగు వారిని చూడటం తెలుగు వాడి అడ్రస్ చెప్పాలి అంటే మద్రాస్ అనే చెప్పడం పేరు నుంచి తెలుగు వాడు అంటే ఇది అని చెప్పే వరకు తీసుకుని వెళ్ళిన నటుడు ఎన్టీఆర్. ఈ మూడు అక్షరాలూ కూడా ఇండియన్ సినిమా ను ఒక ఊపు ఊపాయి. తెలుగు సినిమాలో అయితే ఆయన ముందు ఆయన తర్వాత అనే విధంగా ఉంది అంటే ఆయన సాధించిన విజయం గాని ఆయన తెచ్చుకున్న పేరు గాని ఆయన వేసిన ముద్ర గాని అలాంటివి అనేది అర్ధమవుతుంది. 

 

ఎన్టీఆర్ కి ముందు ఎన్టీఆర్ కి తర్వాత. రాజకీయం అయినా మరొకటి అయినా సరే. అయితే ఆయన జీవితంలో ఎక్కువగా విశాదాలే ఉంటూ ఉంటాయి. ఆయన యెనలేని పేరు తెచ్చుకున్నా సరే ఆయన పెద్ద కుమారురు రామకృష్ణ మరణం ఆ తర్వాత ఆయన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు, ఆ తర్వాత తన రెండో వివాహం ఇలా చాలా వరకు అవమానాలే కనపడుతూ ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఆయనను కొందరు తీవ్రంగా అవమానించారు అనేది వాస్తవం. తనకు ఎంత పేరు ఉన్నా సరే ఎన్టీఆర్ మాత్రం ఆ అవమానాలను భరించలేదు. 

 

ఆయనను దాటి ఏదీ జరగదు అనుకున్నా సరే ఆయనను దాటే చాలా వరకు జరిగాయి. ఆయన స్థాపించిన  పార్టీ ఆయనదు కాకపోవడం నుంచి ప్రతీ ఒక్కటి కూడా విషాదం గానే జీవితం చివరిలో చెప్పుకోవచ్చు. లక్ష్మీ పార్వతిని ఆయన అధికారికంగా పెళ్లి చేసుకున్న రోజు కూడా ఎన్నో విమర్శలు ఎన్నో అవమానాలు ఎదురు అయ్యాయి అనేది వాస్తవం. ఆ విధంగా ఎన్టీఆర్ తన జీవితంలో మంచి పేరు తో పాటు విషాదాల తో కూడా సావాసం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: