ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భామ రాశీ ఖన్నా, ఆ సినిమాలో నటనకి మంచి ప్రశంసలు దక్కించుకుంది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా తర్వాత రాశీకి అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా అవేవీ ఆమెని స్టార్ హీరోయిన్ ని చేయలేకపోయాయి. మొన్నటికి మొన్న వచ్చిన ప్రతిరోజూ పండగే, వెంకీమామా చిత్రాలు విజయం సాధించినప్పటికీ అవకాశాలు మాత్రం చెప్పుకోదగ్గట్లుగా రావట్లేదు.

 

 

అయితే విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో రాశీ ఖన్నా పాత్రపై విమర్శలు వచ్చాయి. ఆ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్లలో నటించడంతో విమర్శలు తలెత్తాయి. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపై బాగా నమ్మకం పెట్టుకుందట. కానీ అది బోల్తాకొట్టడంతో ఏం చేయలేకపోయింది. అదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమెకి తమిళ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయట.

 

 


ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో మన ముందుకు వస్తున్న సూర్య, తర్వాతి చిత్రంగా హరి దర్శకత్వంలో నటిస్తున్నాడని అంటున్నారు. అయితే ఇందులో హీరోయిన్ గా రాశీ ఖన్నాని తీసుకోనున్నారని సమాచారం. తమిళంతో పాటు తెలుగులోనూ పాపులర్ అయిన సూర్య సరసన అవకాశం రావడం రాశీ అదృష్టం అనే చెప్పాలి. ఇదే కాదు సుందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరణ్మయి-౩ చిత్రంలోనూ అవకాశం వచ్చిందని అంటున్నారు.

 

 

ఈ రెండు చిత్రాలు విజయవంతం అయితే తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చినట్టే అని చెబుతున్నారు. ఏదైతేనేం తెలుగులో అంతగా సక్సెస్ చూడని రాశీకి తమిళంలో అవకాశాలు రావడం అదృష్టమే. మరి ఆ అదృష్టంతోనే అక్కడ స్టార్ హీరోయిన్ గా నిలబడుతుందా లేదా చూడాలి.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: