బాలీవుడ్ భామ ఆలియా భట్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజులా కనిపించనున్న రామ్ చరణ్ కి జోడీగా ఆలియా భట్ నటిస్తుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆలియా భట్ ఇంతవరకూ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనలేదు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మొదలయ్యే షెడ్యూల్ లో ఆలియా పాల్గొననుందట.

 

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ చాలా బిజీగా ఉంది. అయితే లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆలియా భట్ ఒకానొక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలని వెల్లడించింది. తాను చేసిన సినిమాల్లోని పాత్రల్లో కళంక్ సినిమాలో  ‘రూప్ చౌధురి’ పాత్ర సవాల్ గా అనిపించిందట. ఆ పాత్రలో నటించడం ఒక ఛాలెంజిగా తీసుకున్నానని తెలిపింది.

 

ఆ క్యారెక్టర్ మాదిరి నేను నా జీవితంలో ఎప్పుడూ లేను. అందుకే ఆ పాత్రలోకి వెళ్లడానికి నాకు టైమ్ పట్టేదని చెప్పింది. ఇక ఆ సినిమాలోని ఘర్ మోరె పర్ దేశియా’ అనే పాట మీద డాన్స్ చేస్తే అందరూ చాలా బాగా చేశావు.. అచ్చం మాధురీ దీక్షిత్ లా అనిపించావని అన్నారట. అయితే దానిని ఖండించిన ఆమె, మాధిరి దీక్షిత్ లా డాన్స్ చేయడం ఎవరివల్లా కాదని, ఆమె లెజెండ్ అని పేర్కొంది.

 

కాకపోతే క్లాసికల్ డాన్స్ కథక్ లో ఒక ఏడాది పాటు శిక్షణ తీసుకున్నానని, దానివల్లే డాన్స్ బాగా చేయగలుగుతున్నానని, ఖాలీ టైమ్ దొరికినప్పుడలా డాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్నని తెలిపింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆలియా భట్, డైరెక్టర్ మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే కొద్ది కాలంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె ఒక బిజీ యాక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: