'నువ్వొస్తానంటే నేనోద్దంటున్నానా' 'బొమ్మరిల్లు' 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' 'ఓయ్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన హీరో సిద్ధార్థ్. దక్షిణాదిలో మంచి పేరు సంపాదించిన సిద్ధార్థ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాలలో నటించాడు. గతేడాది 'అరువం' అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా.. తెలుగులో ఇది 'వదలడు' పేరుతో విడుదలైంది. ఈ చిత్రానికి కూడా అంత ఆదరణ లభించలేదు. ఇటీవల వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సిద్ధార్ద్ తన మార్కెట్‌ని పెంచుకునేందుకు చాలా కష్టపడుతున్నాడు. చివరగా 'బాద్ షా' సినిమాలో గెస్ట్ రోల్ చేసిన సిద్ధూ మళ్ళీ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించలేదు. కానీ 'గృహం' 'వదలడు' లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే చాలా రోజుల తర్వాత మన 'బొమ్మరిల్లు' సిద్ధార్థ ఇప్పుడు ఒక తెలుగు సినిమాలో నటించబోతున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో షికారు చేస్తోంది. 

 

'Rx 100' లాంటి సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ‘మహా సముద్రం’ అనే మల్టీస్టారర్ పట్టాలెక్కించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోలుగా చాలా మంది పేర్లే తెరపైకి వచ్చాయి. అయితే చివరికి ఒక హీరోగా యంగ్ హీరో శర్వానంద్ ని ఫైనలైజ్ చేశారట. అయితే ఈ చిత్రంలో మరో హీరోగా రవితేజ నటించబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ మాస్ మహారాజా వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో హీరో సిద్ధార్థతో ముందుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోందని.. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ లో నటించడానికి సిద్ధార్థ్ తో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారని.. సిద్దార్థ్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఇంటరెస్ట్ చుపిస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సిద్దార్థ్ కూడా తెలుగులో తన రీఎంట్రికి ఇదే మంచి సినిమా అని భావిస్తున్నాడని కూడా అనుకున్నారు. 

 


కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో సిద్ధార్థ్ నటించట్లేదట. మరి సెకెండ్ హీరో పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. పాపం ఈ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలనుకున్న సిద్ధుకి నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా కరోనా హడావుడి ముగిసాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సినిమాలో సెకెండ్ హీరో పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: